ఆవిష్కృతం కానున్న ఆదిత్యుడి అంతరంగం

ఖగోళ పరిశోధనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటికే అనేక రహస్తాలు ఛేదిస్తున్న మానవుడు జాబిల్లి గుట్టును తెలుసుకున్నాడు. అంగారకుడి రహస్యాలను శోధిస్తున్నాడు. రోవర్‌ ద్వారా అక్కడి వాతావరణం గురించి పరిశోధిస్తున్నాడు. మనకు అక్కడ ఆవాసం ఉండే అవకాశాలను లెక్కవేస్తున్నాడు. ఇలా అనేక పరిశోధనల కారణంగా తెలియని అనేక రహస్యాల గుట్టును విప్పుతున్నాడు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు ఒక ఎత్తయితే ఆదిత్యుడి రహస్యాలను తెలుసుకోవాలన్న ప్రయత్నం సాహసంతో కూడుకున్నది కాక మరోటి కాదు. మండుతున్న అగ్నిగోళం ముందుకు వెళ్లి నిలబడగలాలంటే ఎంతో ధైర్యం కావాలి. మామూలు ఎండవేడిమికి తట్టుకోలేని మనం కోట్ల ఫారిన్‌ హీట్‌ వేడి కలిగిన ఆదిత్యుడిని చేరడం సామాన్య విషయం కాదు. కానీ ఇప్పటి వరకు అనేక అసాధ్యాలను సుసాధ్యం చేసిన పరిశోధకులు తమ మస్తిష్కానికి పదను పెట్టారు. అంగారక పరిశోధనలు పురోగతిలో ఉండగానే ఆదిత్యుడిపై ఆసక్తి పెరిగింది.మండే అగ్నిగోళం సూర్యుడి గుట్టువిప్పడమే లక్ష్యంగా తొలి అడుగు పడింది. నాసా ప్రయోగించిన పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ ఉపగ్రహం నిప్పులు చిమ్ముతూ సూర్యుని వద్దకు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫ్లోరిడాలోని కేప్‌ కానారెల్‌ రాకెట్‌ స్టేషన్‌ నుండి స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు డెల్టా-4 రాకెట్‌ ద్వారా పార్కర్‌ సోలార్‌ప్రోబ్‌ అంతరిక్షంలోకి ప్రవేశించింది. ప్రయోగంలోని తొలిదశ విజయవంతం అయినట్లు శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఉపగ్రహాల చరిత్రలోనే ప్రోబ్‌ అత్యంత వేగంగా కదులుతుందని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. సూర్యునిపై ఉండే దుర్భరమైన వాతావరణ పరిస్థితులను, రేడియోధార్మికతను తట్టుకునేగలిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇతర ఉపగ్రహాలతో పోలిస్తే 500 రెట్లు ఎక్కువగా ఉష్ణాన్ని తట్టుకోగలిగే పటిష్టవంతమైన కవచాన్ని ఏర్పాటు చేశారు. సూర్యుని విషయంలో ఉన్న అనేక సందేహాలను, రహస్యాలను ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌ చేధిస్తుందని శాస్త్రవేత్తలుజ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సూర్యుడి ఉపరితల వాతావరణ వలయమైన కరోనాలోకి వెళ్లడం ఈ పరిశోధన లక్ష్యం. ప్రోబ్‌ ఆరువారాలలో శుక్ర గ్రహానికి చేరువగా వెళుతుంది. ఆసమయంలో శుక్రుడి గురుత్వాకర్షణ శక్తిని వినియోగించుకుని తన కక్ష్య నిడివిని తగ్గించుకుని, వేగాన్ని మార్చుకుని ఏడు సంవత్సరాల అనంతరం 2024నాటికి సూర్యుని ఉపరితలాన్ని చేరుకుంటుంది. సూర్యుని చుట్టూ 24 కక్ష్యలలో తిరిగి కరోనాను అధ్యయనం చేస్తుంది. అక్కడ భూమిని ప్రభావితం చేసే ప్రదేశాన్ని గుర్తిస్తుంది. పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ భూమి, సూర్యుల మధ్య దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశిస్తుందని, ఈ కక్ష్యలో ఒక భ్రమణం పూర్తి చేయడానికి 88రోజులు పడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రుడి విూద కాలుడి నట్లు అమెరికా చెప్పుకున్నా ఆ తరవాత ఎందుకనో దానిలో పురోగతి కానరాలేదు. దీంతో ఆ ప్రయోగంపై ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనేక అనుమానాలు తొలుస్తున్నాయి. అయితే చంద్రయాన్‌ ద్వారా భారత అంతరిక్ష పరిశోధాన సంస్థ ఇస్రో ప్రయాగాలు ఫలించాలయి. చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయని మనవారు గుర్తించారు. ఈ దశలో ఓ వైపు అంగారక గ్రహంపై పరిశోధనలను రోవర్‌ ముమ్మరం చేసింది. ఇదిలావుండతానే ఆదిత్యుడి గుట్టు తెలుసుకునే ప్రయత్నంలో అమెరికా నాసా ప్రయోగం విజయం దిశగా సాగుతోంది. సూర్యునికి అత్యంత సవిూపంగా వెళ్లే ఉపగ్రహం కావడంతో ఈ ఉపగ్రహానికి అనేక ప్రత్యేకతలున్నాయి. దీని రూపకల్పనలో శాస్త్రవేత్తలు ఏళ్లకొద్ది గడిపారు. దీంతో ప్రయోగకేంద్రంలో ఆదివారం నాడు అత్యంత ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. నింగిలోకి దూసుకెళ్లిన గంట తరువాత వాహకనౌక నుండి ఉపగ్రహం వేరుపడి అంతరిక్షంలోకి ప్రవేశించిందని నాసా అధికారికంగా ప్రకటించింది.

ఆఇవారం ఆదిత్యుడికి అత్యంత ఇష్టమైన రోజుగా మనం ఆదిత్యహృధం చదువుతాం. కాకతాళీయమే అయినా నాసా కూడా ఆదివారమే దీనిని ప్రయోగాన్ని ఆదివారమే చేపట్టింది. సూర్యుడికి అత్యంత సవిూపంలోకి చేరుకునేందుకు పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ నింగిలోకి దూసుకెళ్లింది. సూర్యుడి వేడిని తట్టుకుని ముందుకు సాగేలా దీనిని రూపొందించారు. తొలిసారిగా భానుడి బాహ్య వాతావరణంలో అడుగిడబోతున్న ఈ చరిత్రాత్మక వ్యోమనౌకను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఆదివారం ప్రయోగించింది. అక్కడి గుట్టుమట్లను విప్పేందుకు ఇది ఏడేళ్ల సుదీర్ఘ ప్రయాణం చేయనుంది. సౌర బాహ్యపొర కరోనా, అంతరిక్షంపై అది చూపుతున్న ప్రభావం విూద ప్రధానంగా ఇది దృష్టి కేంద్రీకరించనుంది. సూర్యుడిని ‘ముద్దాడేందుకు’ ఇప్పుడే ప్రయాణాన్ని మొదలుపెట్టిందిఅని ప్రయోగమైన రెండు గంటలకు నాసా తెలిపింది. సౌర తుపానులతో ఉపగ్రహాలు దెబ్బతింటాయి. కక్ష్యలోని వ్యోమగాముల ప్రాణాలకూ వీటితో ముప్పు పొంచివుంది. రేడియో కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, పవర్‌ గ్రిడ్‌లనూ ఇవి ధ్వంసం చేయగలవు. తాజా ప్రోబ్‌తో ఈ ముప్పులను మెరుగ్గా అంచనా వేసేందుకు వీలుపడుతుందని నాసా తెలిపింది. భూమిపై సంభవించే పరిణామాలతోపాటు విశ్వాన్ని మెరుగ్గా అర్థం చేసుకొనేందుకు ఈప్రయోగం తోడ్పడుతుంది. తదుపరి రెండు నెలలపాటు శుక్రుడి దిశగా ఈ పార్కర్‌ ప్రోబ్‌ దూసుకెళ్తుంది. అక్టోబరులో శుక్రుడి గురుత్వాకర్షణ సాయంతో దీని కక్ష్యను పెంచుకుంటూ క్రమంగా సూర్యుడివైపు మళ్లుతుంది. నవంబరు నాటికి ఈ ప్రోబ్‌ సూర్యుడికి 1.5 కోట్ల మైళ్ల దూరంలోని బాహ్య వాతావరణమైన కరోనాలోకి చేరుకుంటుంది. డిసెంబరులో తొలి పరిశీలన సమాచారాన్ని భూమిపైనున్న ప్రయోగ కేంద్రానికి పంపుతుంది. ఏడేళ్లలో ఏడుసార్లు శుక్రుడి గురుత్వాకర్షణ శక్తితో ఇది కక్ష్యను పెంచుకుంటుంది. క్రమంగా ఇది సూర్యుడికి చేరువవుతుంటుంది. చివరగా భానుడి ఉపరితలం నుంచి 38లక్షల మైళ్ల ఎత్తులో ఉంటుంది. ఈ సమయం లో దీని వేగం గంటకు ఏడు లక్షల కి.విూ. ఉంటుంది. అత్యంత వేగంగా కదులుతున్న వ్యోమనౌకగా ఇది రికార్డు సృష్టించనుంది. సూర్యుడికి దగ్గరగా వెళ్లినప్పుడు ఇది 1,377 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను ఎదుర్కొంటుంది.