ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం పోషించిన క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్

ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం పోషించిన పాత్ర, సాధించిన విజయాలపట్ల క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. భారతదేశం సాధించిన మొత్తం క్రీడా పతకాల్లో, దేశంలోనే తెలంగాణ 2వ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. క్రీడల్లో యువతీ యువకులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందనడానికి ఈ విజయాలు నిదర్శనంగా నిలిచాయన్నారు. క్రీడారంగం పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, శాట్ చైర్మన్ ఎ.వెంకటేశ్వర్ రెడ్డిలతోపాటు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయడం వల్లనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని సీఎం కేసీఆర్ అన్నారు. స్వయంగా మంత్రి బర్మింగ్ హామ్ వెళ్లి క్రీడాకారులను ప్రోత్సహించినందుకుగాను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను సీఎం అభినందించారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం అమలు పరుస్తున్న గ్రామీణ క్రీడా మైదానాలు తదితర చర్యల వల్ల క్రీడారంగం పుంజుకుంటున్నదని, భవిష్యత్ లో జరిగే జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో తెలంగాణ మరిన్ని పతకాలతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి, విజయకేతనం ఎగురవేయాలని సీఎం ఆకాంక్షించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈనెల 22వ హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో కామన్ వెల్త్ క్రీడల్లో విజయం సాధించిన క్రీడాకారులను సత్కరించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.