ఇంటర్నేషనల్‌ టాలెంట్‌ షోకు క్రాంతి

సూర్యాపేట,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  డ్రిల్లింగ్‌ మ్యాన్‌ క్రాంతి కుమార్‌కి అంతర్జాతీయ టాలెంట్‌ షోలో పాల్గొనే అరుదైన అవకాశం దక్కింది. ఈ నెల 9వ తేదీన లాస్‌ ఏంజెల్స్‌లో జరిగే అమెరికాస్‌ గాట్‌ టాలెంట్‌ కార్యక్రమంలో ఆడిషన్‌ ఇచ్చే అవకాశం తెలంగాణ బిడ్డ, సూర్యాపేట నివాసిని వరించింది. ఇప్పటికే స్థానిక, జాతీయ స్థాయిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొని క్రాంతి తన అద్భుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. సలసల మరిగే నూనెలో చేతులు పెట్టడం, డ్రిల్లింగ్‌ మిషన్‌తో ముక్కులో డ్రిల్‌ చేసుకోవడం, ఏకకాలంలో 32 పదునైన కత్తులను నోట్లోకి మింగడం వంటి పలు సహాస కృత్యాలు క్రాంతి చేస్తుంటాడు. ఆహ్వానం అందినా, అమెరికా వెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో క్రాంతి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆశ్రయించాడు. క్రాంతి టాలెంట్‌ను మెచ్చిన ఎమ్మెల్యే అమెరికా వెళ్లేందుకు కావాల్సిన ఆర్థిక చేయూతను అందించనున్నట్లు పేర్కొన్నారు.