ఇంటర్‌నెట్‌లోనూ శ్రీరామనవమి టిక్కెట్లు

భక్తులకు అందుబాటులో ఉండేలా చర్యలు
భారీగా ఏర్పాట్లు చస్తున్న అధికారులు
భద్రాచలం,మార్చి8(జ‌నంసాక్షి): శ్రీరామనవమి సెక్టార్‌ టిక్కెట్లను కౌంటర్ల ద్వారా మాత్రమే విక్రయించడం ద్వారా చాలా మిగిలిపోతున్నాయని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యేడు కూడా  టిక్కెట్లను ఇంటర్‌నెట్‌లో
భక్తులకు అందుబాటులో  ఉంచాలని నిర్ణయించారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఏప్రిల్‌ 14న శ్రీరామనవమి సందర్భంగా జరిగే సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, విఐపిలు ఇక్కట్ల కు గురికాకుండా చూడాలని నిర్ణయించారు. తలంబ్రాల కౌంటర్లను వీలైనన్ని ఎక్కువ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటిని రద్దీ లేని ప్రాంతంలో ఆలయానికి కనీసం 20 విూటర్ల దూరంలో ఏర్పాటు చేసి అందరికీ తలంబ్రాలను అందించాలన్నారు. ప్రసాదాల కౌంటర్‌పై దృష్టిసారించి వీటి విక్రయాలు ఎక్కువ సంఖ్యలో జరిగేలా చూడాలన్నారు.  దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పారి శుధ్యం మొదలు తాగునీరు, స్నానఘట్టాల వద్ద ఏర్పాట్లతో పాటు ప్రతీ ఒక్కరూ కల్యాణ మ¬త్సవాన్ని కనులారా తిలకించే విధంగా సెక్టార్లను తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. వచ్చేనెల 14వ తేదీన భధ్రాచలంలో జరగనున్న శ్రీరామనవమి, మహాపట్టాభిషేకం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈసారి ఇంటర్‌నెట్‌  సేవలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలన్నారు. అలాగే ఏర్పాట్లు శోభాయమానంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఇప్పటికే  ఆదేశించారు. ఆ మరుసటి రోజు పట్టాభిషేకానికి భక్తులకు సరిపడా సదుపాయలు కల్పించాలన్నారు. ప్రతీ భక్తుడు సీతారాముల్ని దర్శించుకుని ప్రశాంతంగా ఇంటికి చేరేలా అధికారులు సమన్వయంగా పని చేయాలన్నారు. ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు పట్టుకొని ముఖ్యమంత్రి రానున్నందున బందోబస్తు పటిష్టంగా ఉండాలన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని ఈసారి ఆలయ పరిసరాలతోపాటు భద్రాచలం పట్టణం అంతా సుందరంగా కన్పించేలా పారిశుద్ధ్య చర్యలు పాటించాలన్నారు. దుకాణాల యజమానులకు ఇప్పటి నుంచే అవగాహన కల్పించి చెత్త డబ్బాలను ఏర్పాటు చేసుకునేలా చూడాలని సూచించారు. గోదావరి కరకట్ట అందంగా కన్పించేలా రాత్రివేళ పూర్తిస్థాయిలో విద్యుత్తు దీపాలను వెలిగించాలన్నారు. గోదావరిలో ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా స్నానాలు చేసే ప్రాంతాన్ని గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని వివరించారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. వసతి నిమిత్తం కొన్ని గదులను భక్తులకు కేటాయిస్తూ అంతర్జాలంలో అందుబాటులో ఉంచాలని చెప్పారు. వేసవిలో ఉత్సవం జరుగుతున్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. తాగునీటి సదుపాయంపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చోట మజ్జిగ పొట్లాలను, ఓఆర్‌ఎస్‌ పొట్లాలను అందించాలన్నారు. పార్కింగ్‌ ప్రదేశాలను గుర్తించి ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. కల్యాణం వీక్షించే ప్రాంతంలో వీఐపీలు ప్రవేశించే చోట సంబంధిత శాఖల సిబ్బంది అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ప్రముఖులతోపాటు ప్రతీ భక్తుడితో సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలన్నారు. బ్ర¬్మత్సవాలకు వచ్చే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక  బస్సులు నడుపుతున్నందున దీనిపై ప్రచారం చేయాలని, గోదావరి వంతెనపై మరమ్మతులు పూర్తి చేసి విద్యుత్తు దీపాలను అలంకరించాలని వివరించారు. విద్యుత్తు అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.