ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

విశాఖపట్టణం,నవంబర్‌14(జ‌నంసాక్షి): :ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. ఫిబ్రవరి 1 నుంచి 20 ప్రాక్టికల్స్‌…ఫిబ్రవరి 27 నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం, 28 నుంచి రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలు జరిగిన 20-22 రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.