ఇంటింటి ప్రచారంలో నేతల పలకరింపులు

కెసిఆర్‌ అభివృద్ది చూసి ఓటేయాలని పిలుపు

టిఆర్‌ఎస్‌ మాత్రమే అభివృద్ది చేయగలదంటూ ప్రచారం

భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌1(జ‌నంసాక్షి): పింఛన్లు వస్తున్నాయా.. రైతు బంధు అందిందా.. అంటూ ప్రతి ఒక్కరినీ సొంత మనిషిలా పలకరించం ఇప్పుడు బరిలో ఉన్న గులాబీ నేతలకు నిత్యకృత్యంగా మారింది. రోజూ గ్రామాలకు వెళ్లడం నేరుగా ప్రజలను కలవడం,పథకాల గురించి ఆరా తీయడం సాగుతోంది. ఈ క్రమంలో గ్రామాల్లో పలువురిని పేర్లతో పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకోవడం పరిపాటి మారింది.

ప్రజలు కూడా అంతే ఆప్యాయంగా వారికి సమాధానం ఇస్తున్నారు. అందుబాటులో ఉంటూ అండగా ఉంటా…తనను ఆశీర్వదించి కారు గుర్తు కు తిరిగి తనకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అశ్వారావుపేట నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు కోరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. పెద్ద ఎత్తున మహిళలు, యువకులు మేళతాళాలతో, డప్పు వాయిద్యాలతో ప్రచారం సాగిస్తున్నారు.తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించిం దన్నారు. కేసీఆర్‌ అధికారం చేపట్టిన ఈ నాలుగున్నరేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం 40 ఏళ్ల అభివృద్ధిని సాధించిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి జిల్లాల్లో వ్యవసాయ సాగుకు అవసరమైన నీటిని అందించేందుకు వేలకోట్ల రూపాయలు వెచ్చించి సీతారామప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. దశాబ్దాలుగా ఆచరణకు నోచుకోని పాములేరు, సాకివాగులపై వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చే యించి బ్రిడ్జిల నిర్మాణం పూర్తిచేయించిన ఘనత తనకే దక్కుతుందన్నారు. పామాయిల్‌ సాగు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దమ్మపేట మండలంలోని అప్పారావుపేటలో రూ.100 కోట్లతో అధునాతన టెక్నాలజీ పా మాయిల్‌ ఫ్యాక్టరీని తీసుకువచ్చింది కూడా తన హయాంలోనే నని తాటి గుర్తుచేశారు. ఇకపోతే దశాబ్దాలుగా విప్లవ గ్రూపులకే పరిమితమైన ఇల్లెందు ఏజెన్సీ గ్రామాలలో అభివృద్ధిని కోరుకుంటున్న జనం టీఆర్‌ఎస్‌ జెండా చేతపట్టి కారు గుర్తుకు సై అంటున్నారని కోరం కనకయ్య ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన మరింత ఉత్సాహాన్నిచ్చిందన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆప్యాయంగా ప్రజలను కోరం పలకరిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి, ఈ ప్రాంతంలో తాను చేసిన అభివృద్ధిని సవివరంగా ప్రజలకు గుర్తుచేస్తూ ప్రచారం కొనసాగించారు. నాలుగున్నరేళ్ళలో అనేక మార్లు ఏజెన్సీ గ్రామాలను చుట్టివచ్చిన కోరం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. గతంలో ఎవరూ ఇంత అభివృద్ది చేయలేదంటూ తప్పకుండా కారు గుర్తుకు ఓటు వేయాలని తమ అభ్యర్థిస్తున్నారు. నాలుగున్నరేళ్ళుగా ఈ ప్రాంతంలో తాము చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల మదిని దోచుకున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ మినీ మ్యానిఫెస్టెలో ప్రకటించిన అంశాలను ప్రజలను టీఆర్‌ఎస్‌కు మరింత దగ్గర చేశాయన్నారు. పినపాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరిని కలుసుకుని ఆత్మీయంగా పలకరిస్తూ ప్రచారం ¬రెత్తి స్తున్నారు. ప్రగతిని వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రతి ఇంటికి తిరుగుతూ అభివృద్‌ధ్దిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఆప్యాయంగా ఇంట్లో వారిని పలకరిస్తూ కారు గుర్తుకు ఓటువేయాలని కోరుతున్నారు. అభివృద్ధికే పట్టం కట్టాలని, అన్ని వర్గాల అభ్యున్నతే టీఆర్‌ఎస్‌

ధ్యేయమన్నారు. ప్రతి కుటుంబానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందాయన్నారు. మారుమూల ఏజెన్సీలోని పల్లెలన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీతోనే ప్రజలకు బంగారు భవిష్యత్‌ అని, రాష్ట్రంలో మళ్లీ సీఎం కేసీఆర్‌ కావాలన్నారు. రైతును రాజును చేయాలనేదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని చెప్పారు.