ఇక పక్కాగా మొక్కల పెంపపకం

తెలంగాణలో హరితహారం ఇక ఆసామాషీ వ్యవహారం కాదు. పక్కాగా మొక్కల పెంపకం జరిగేలా కొత్త పంచాయితీరాజ్‌ చట్టం రూపొందించారు. గ్రామస్థాయిలో సర్పంచ్‌, కార్యదర్శికి బాధ్యతలు అప్పగిస్తూ చట్టం చేశారు. దీంతో మొక్కలు నటడం, పర్యవేక్షించడం ఇక వీరిదే బాధ్యత. ఇది అమల్లోకి రావడంతో ఇకముందు గ్రమాల్లో మొక్కరల పెంపకం ద్వారా అవి పెరిగి చెట్టు కావడానికి పక్కగా ప్రణాళిక రూపొంది నట్లు అయ్యింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ద్వారా గ్రామాలను పచ్చగా తయారు చేయాలన్న సంకల్పానికి దీంతో బలం చేకూరింది. ఇకపోతే నాలుగో విడత హరితహారం ఒకటి రెండు రోజుల్లో ప్రారంభం కాబోతున్నది. ఇందుకు అనుగుణంగా గ్రామాల్లో శిక్షణ మొదలయ్యింది. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక నర్సరీ ఏర్పాటు చేసేవిధంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు కొద్ది రోజులుగా శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా వచ్చిన మాస్టర్‌ ట్రైనర్లు గ్రామాల్లో ఏ విధంగా నర్సరీలు ఏర్పాటు చేయాలనే అంశంపై క్షుణ్ణంగా వివరించారు. ఎంపీడీవోలు, ఏపీవోలు, అటవీశాఖ అధికారులకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా హరితహారంలో భాగంగా నాటిన ప్రతీ మొక్కను సంరక్షించే బాధ్యత ప్రతీ ఒక్కరిది. పంచాయతీరాజ్‌చట్టం 2018 ప్రకారం ప్రతీ గ్రామంలో ఒక నర్సరీని ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టనున్నారు. గ్రామస్థాయిలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటే ప్రణాళికలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకుని, నాటిన ప్రతీ మొక్కను కాపాడుకోవాలి. జిల్లావ్యాప్తంగా అవగాహన కల్పిస్తూ ఇప్పటికే అధికారులకు, ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇచ్చారు. పంచాయతీరాజ్‌ చట్టం పక్కాగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సర్పంచ్‌లు, కార్యదర్శులకు చట్టంలో కీలక బాధ్యతలు అప్పగించి నందున నిత్యం మొక్కలపెంపకం ప్రగతిని పర్యవేక్షిస్తూ వారిని ప్రోత్సహించనున్నారు. ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ చొప్పున ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా కొద్ది రోజులుగా జిల్లాస్థాయి అధికారులకు, ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇస్తున్నారు. గ్రామస్థాయి అధికారులకు సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఏపీవోలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చారు. జిల్లాలో ఏ మొక్కలు ఏ ప్రదేశంలో నాటాలనే వివరాలు వెల్లడించారు.గ్రామ స్థాయిలో సర్పంచ్‌తోపాటు కార్యదర్శికి ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. గ్రామానికి అవసరమైన మొక్కలను నర్సరీల్లో పెంచేందుకు తగు చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రతీ ఏటా 40వేల మొక్కలు నర్సరీలో విధిగా పెంచే విధంగా సర్పంచ్‌, కార్యదర్శులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రతీ గ్రామంలో సర్పంచ్‌, కార్యదర్శితో పాటు ఏపీవోలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు సమన్వయంతో నర్సరీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నాటిన మొక్కలు సంరక్షించే బాధ్యతను కూడా సర్పంచ్‌, కార్యదర్శులకు అప్పగించింది. సర్పంచిలు అలసత్వం వహిస్తే వారిని తొలగించే విధంగా చట్టంలో పొందుపరిచారు. నూతన పంచాయతీ రాజ్‌ చట్టం 2018లో పంచాయతీరాజ్‌ సంస్థలకు గ్రామ పంచాయతీలో పర్యావరణం, పచ్చదనం గురించి స్పష్టమైన బాధ్యతలు ఇచ్చారు. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక నర్సరీ ఏర్పాటు చేయాలి. హరితహారంలో గ్రామానికి కావాల్సినన్ని మొక్కలను పెంచాల్సిన బాధ్యత సర్పంచ్‌, కార్యదర్శులపై ఉంది. గ్రామ పరిధిలోని బోడ గుట్టలు, బంజర భూములు, అటవీ భూములు, సంస్థలు, చెరువు శిఖం, గ్రామ రోడ్లు, ఆవాస రోడ్లు, ఇంటి పరిసరాల్లో మొక్కలను నాటించాల్సి ఉంటుంది. ప్రతీ ఏటా వేల సంఖ్యలో నాటే మొక్కలతో గ్రామాన్ని పచ్చగా మార్చే బాధ్యత గ్రామ పంచాయతీకి ఇచ్చారు. గ్రామ పంచాయతీలకు మార్గనిర్దేశం చేయడానికి సంబంధిత శాఖలన్నీ తమవంతు సహకారాన్ని అందించాల్సి ఉంటుంది.

ముఖ్యంగా అటవీశాఖ, పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధిశాఖ, ఉద్యానశాఖలు సహాయాన్ని అందించాల్సి ఉంది. గ్రామ పంచాయతీలు శిక్షణ ఇచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడవిూ వారికి ఇచ్చారు. గ్రామస్థాయి నర్సరీ వాచర్‌, ఎ/-లాంటేషన్‌ వాచర్‌, అలాగే పంచాయతీ కార్యదర్శి, క్షేత్రసహాయకులకు ఉపయోగకరంగా నర్సరీ ఏర్పాటు, వాటి నిర్వహణ, ఎ/-లాంటేషన్ల పెంపకం తదితర బాధ్యతలు చూడాల్సి ఉంది. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక నర్సరీ ఏర్పాటు చేసుకుని 40వేల మొక్కలు పెంచాల్సి ఉంటుంది. ముందుగా పంచాయతీ పరిధిలో స్థలం ఎంపిక చేసుకోవాలి. అనంతరం మౌలిక వసతులు, మట్టి మిశ్రమం, పాలిథీన్‌ సంచులు, మొక్కలు బ్యాగుల్లో నాటడం, నర్సరీ మొక్కలకు నీరు పట్టడం, నర్సరీలో కలుపు తీత, బ్యాగుల్లో మొక్కల సస్యరక్షణ, నర్సరీ నుంచి నాటే ప్రదేశం వరకు మొక్కల చేరవేత తదితర వసతులను చూసుకోవాల్సి ఉంటుంది. పంచాయతీస్థాయి నర్సరీలు శాశ్వత నర్సరీల మాదిరిగా కాకుండా తాత్కాలిక నర్సరీలుగా ఉంటాయి. దీంతో వీటికి కొద్దిపాటి మౌలిక వసతులు సరిపోతాయి. నర్సరీ కోసం స్థలం ఎంపికలో అధికారులు, ప్రజాప్రతినిధులు చేపట్టాల్సిన చర్యలు, కొన్ని ముఖ్యమైన విషయాలను చట్టంలో రూపొందించారు. గ్రామానికి సాధ్యమైనంత మధ్యలో నర్సరీ ఏర్పాటు చేయాలి. గ్రామ రోడ్లకు దగ్గరగా ఉండి ట్రాక్టర్‌ ఇతర వాహనాలు వచ్చి, వెళ్లే విధంగా ఉండాలి. నర్సరీ కోసం ఎంచుకున్న స్థలానికి పశువులు, ఇతర జంతువులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం స్థానికంగా దొరికే వస్తువులతో నర్సరీ చుట్టూ ఒక కంచెను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. నర్సరీ కోసం ఎంపిక చేసిన స్థలంలో బావి, బోరుతోపాటు విద్యుత్‌ సరఫరా తప్పక ఉండేలా చూసుకోవాలి. మొత్తంగా ఇలా పక్కాగా ఏర్పాట్లు చేయడంతో గ్రామాల్లో హరితహారం పక్కాగా సాగనుంది. దీనినుంచి సర్పంచ్‌లు తప్పించుకోలేరు. అలాగే మొక్కల పెంపకం ఖచ్చింతంగా అమలు కానుంది.