ఇది కార్పొరేట్‌ సర్కారు…కర్షకులంటే గిట్టదు

` కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలా వ్యవహరిస్తోంది
` తెలంగాణ రైతులకు అండగా నిలవడంలో విఫలం
` యాసంగిలో వరి వేయవద్దని రైతులకు చెపుతాం
` ప్రేమలేఖలు రాసేందుకు వచ్చినట్లు కేంద్ర మంత్రులు భావిస్తున్నారు
` ఢల్లీిలో విూడియా సమావేశంలో మంత్రి నిరంజన్‌ రెడ్డి
న్యూఢల్లీి,డిసెంబరు 23(జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాసే సర్కారులా వ్యవహరిస్తోందని,కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోన్న విధానాల వల్ల రైతులు బాధపడే పరిస్థితి వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. దిల్లీలో మంత్రి నిరంజన్‌ రెడ్డి విూడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అనేక శాఖలు తెలంగాణ పురోగతిని ప్రశంసించాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాజ్యంగపరమైనదే అనే విషయాన్ని రాష్ట్ర భాజపా నేతలు మర్చిపోతున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని భాజపా కార్పొరేట్‌ కంపెనీలకు ఏమైనా చేస్తోందని.. దగ్గరుండి మరీ కంపెనీలకు ఒప్పందాలు కుదుర్చి ఇస్తోందన్నారు. మరి రైతులను ఎందుకు విస్మరిస్తోందని నిలదీశారు. ధాన్యం సమస్య పరిష్కారం కోసం దిల్లీలో పడిగాపులు కాస్తున్నామని.. రెండు రోజుల్లో నిర్ణయం చెప్తామని ఇంత వరకు చెప్పలేదని అసహనం వ్యక్తం చేశారు. ఏదో ప్రేమలేఖలు రాసేందుకు దిల్లీకి వచ్చినట్లు కేంద్ర మంత్రులు భావిస్తున్నారని ఆక్షేపించారు.‘‘దాదాపు 20 ఉత్పత్తులకే కేంద్రం నామమాత్రపు ఎంఎస్‌పీ ఇస్తోంది. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని ప్రధాని మోదీ చెప్పారు. ఇప్పటివరకు వాటిని అమలు చేయలేదు. ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించడం లేదు. యూపీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని మోదీ హావిూ ఇచ్చారు. బ్యాంకు రుణాలు ఎగవేస్తున్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారు. రైతులు, కొత్తతరం వారు వ్యవసాయాన్ని విడిచిపెట్టేలా మోదీ వ్యవహరిస్తున్నారు. ప్రోత్సహిస్తే రాష్ట్రంలో యాసంగిలోనూ 70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. గుజరాత్‌లో సాగుకు 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నారా?ఏ విషయంలోనూ కేంద్రం నుంచి సరైన విధంగా సాయం అందడం లేదు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ నిధులను కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్రం నిర్వర్తించాల్సిన బాధ్యతను వదిలేసి.. రాష్ట్రాలపైకి దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. అడిగేందుకు వచ్చిన రాష్ట్రాల నేతలను అవమానిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఒకటే విషయం అడుగుతున్నాం. ప్రధానమంత్రితో మాట్లాడి.. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించలేరా? ఇదేవిూ చేయకుండా సీఎం కేసీఆర్‌ను తిట్టడం.. తెలంగాణను తిట్టడం.. అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్రం తన వైఖరేంటో ఇప్పటికైనా స్పష్టంగా చెప్పాలి’’ అని నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.పారిశ్రామిక రంగంలో పరిస్థితి వేరు..వ్యవసాయ రంగంలో మాత్రం కష్టం రైతుదే అని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఒక్క తెలంగాణలో మాత్రమే అన్ని రకాల వాతావరాణాలను తట్టుకుని పంటలు పండుతాయని తెలిపారు. ఈ ఉత్పత్తులను కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించాల్సి వస్తోందన్నారు. వనరులు ఉండి కూడా కేంద్రం సహకారం లేకపోవడంతో తెలంగాణ రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ కొద్ది పాటి ప్రోత్సాహం ఇస్తే చాలన్నారు. ఢల్లీిలో టిఆర్‌ఎస్‌ నేతలతో కలసి డియాతో మాట్లాడుతూ గతంలో కేంద్రం, ఎఫ్‌సీఐ సహా పలు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రశంసించాయన్నారు. ప్రస్తుతం దురదృష్టవశాత్తు కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. రాజ్యాంగం పరిధిలో పని చేసే ప్రభుత్వంలా కాకుండా రాజకీయ పార్టీ వ్యవస్థలా పని చేస్తోందని ఆరోపించారు. మాకు పని లేకుండా ఢల్లీికి వచ్చినట్లు ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. యాసంగిలో వరి వేయం.. విూరే వరి వేయొద్దని చెప్పారు కాబట్టి రైతులను కూడా కోరుతామన్నారు. వానా కాలంలో ఇచ్చే వడ్లు ఎంతిస్తే అంత కొంటామన్నారు. దానిని రాతపూర్వకంగా ఇవ్వండి అని అడగడానికే వచ్చామన్నారు. 60 లక్షల టన్నులు కొంటామని గతంలో చెప్పారు ఆ పరిమితి అయిపోవడంతో దాన్ని పెంచాలని కోరామన్నారు. దీనిపై ఒకటి రెండ్రోజుల్లో చెబుతామన్నారు.. అందుకే ఢల్లీిలో ఆగాం.. కానీ ఆ సమయం అయిపోయినా ఇంకా ఎటువంటి స్పందన కేంద్రం నుంచి రాలేదని మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు.