ఇరు రాష్టాల్ర మధ్య చిచ్చు పెడుతున్న జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ విడిపోయాక రెండు రాష్టాల్రు ఇప్పుడిప్పుడే నిలదొక్కకుంటున్నాయి. గతం గాయాలను మాన్పుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికీ విభజన జరిగి రెండేళ్లు కావస్తున్నా అనేక సమస్యలు ఇరు రాష్టాల్ర  మధ్య అపరిష్కృతంగా ఉన్నాయి. హైకోర్టు విభజన, ఉద్యోగుల పంపిణీ తదితర సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటిని పరిష్కరించాల్సిన కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. అనేకానేక అంశలపై కేంద్రం తీరు దారుణంగా ఉంది. అయినా ఇరు రాష్టాల్ర తెలుగు ప్రజలు సంయమనం వీడకుండా సోదరభావంతో మెలుగుతన్నారు. రాజకీయ పార్టీలు కూడా ఇప్పటి వరకు ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం లేదు.  ఇరు రాష్టాల్ల్రో ముఖ్యమంత్రులు హుందాగా ఉంటూ ప్రజల్లో ఐక్యత కొనసాగేలా పాలన సాగిస్తున్నారు. పానలో ఇద్దరూ తమదైన శైలితో ముందుకు సాగుతున్న లక్ష్యం మాత్రం అభివృద్దిగా ఉంది. గమ్యాలు వేరైనా లక్ష్యాలు మాత్రం ఒకటే కావడంతో కాస్తా డిఫరెంట్‌గా అయినా తెలుగు రాష్టాల్రు ముందుకు దూసుకుని పోతున్నాయి. ఈ దశలో కాంగ్రెస్‌, వైకాపా రాజకీయాలు విధ్వంసకరంగా ఉన్నాయి. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా రాయలసీమ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రధనాంగా కాంగ్రెస్‌ ఎపి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, వైకాపా అధ్యక్షుడు జగన్‌ అగ్గి విూద గుగ్గిలం జల్లేలాలా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉండగానే మహారాష్ట్ర,కర్నాటక రాష్టాల్రు వందలాదిగా చిన్నాపెద్ద ప్రాజెక్టులు కట్టి మనకు నీళ్లు రాకుండా అనేకానేక అక్రమ ప్రాజెక్టులు కట్టాయి. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నా వాటిని అడ్డుకోవడం లేదా, వాటి నుంచి నీటిని విడుదల చేయించేందుకు గట్టిగా ప్రయత్నం చేయలేదు. ఇందుకు కాంగ్రెస్‌ ప్రధానంగా దోషిగా నిలబడాలి. దీనిని మరచి పోయి తాజాగా జగన్‌ జలదీక్ష పేరుతో ఇరురాష్టాల్ర మధ్యచిచ్చు పెట్టే యత్నం చేస్తున్నారు. తెలంగాణలో చేపడుతున్న అన్ని  ప్రాజెక్టులను  ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపులకు అనుగుణంగా చేపడుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ఎపి ప్రభుత్వంతో చర్చకు సిద్దమని కూడా ప్రకటించింది. ఈ దశలో జగన్‌ చేపట్టిన జలదీక్ష ఉద్రిక్తతలను రెచ్చగొట్టేదిగా ఉంది. రాజకీయంగా పూర్తిగా దెబ్బతింటూ, ఎమ్మె/-యేలు అంతా పార్టీని వీడుతున్న వేళ, వైకాపా ఖాళీ అవుతూ, రాజ్యసభకూడా అర్హత కోల్పోతున్న వేల జగన్‌ దీక్ష చేపట్టిన విసయాన్ని మనం గుర్తించాలి. రాజకీయంగా జగన్‌ విఫల నాయకుడిగా నిలబడ్డారు. విపక్షనేతగా విఫలం అయ్యారు. ఏ సమస్యపై పోరాడాలో తెలియని అజ్ఞానంలో ఉన్నారు. అందుకే  తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌ హిట్లర్‌లా మాట్లాడుతున్నారని ఘాటైన విమర్శ చేశారు. ఇద్దరు చంద్రుల మధ్య చిచ్చు పెట్టి అందులో చలి కాచుకోవాలన్న ఆలోచనతోనే జగన్‌ దీక్షకు దిగినట్లుగా ఉంది. ఇంకా ఆయన భారీ డైలాగులు కొట్టారు.  బ్రహ్మంగారు చెప్పిన ట్లుగా నీళ్ల కోసమే యుద్ధాలు జరుగుతాయేమోనని భయపడుతున్నట్లు చెప్పారు.  కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నదన్న ఆరోపణలు చేస్తూనే, వాటిని  చంద్రబాబు ఏమాత్రం అడ్డుకోవడం లేదంటూ కర్నూలులో మూడు రోజుల జలదీక్షను ప్రారంభించిన తీరు ఆయన రాజకీయ అపరిపక్వతను సూచించింది. ఏ సమస్యపై ఎలా పోరాడాలో తెలియని తనం జగన్‌లో ఉంది. గత రెండేళ్ల కాలంలో ఆయన విపక్షనేతగా పూర్తిగా వైఫల్యం చెందారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడ్డగోలుగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదని పెద్దపెద్‌ ఆరోపణలు చేశారు. ఇక్కడ ప్రాజెక్టుఉలకట్టిందీ లేదు..నీరు దోచుకున్నదీ లేదు. వాటా తేలక ముందే ప్రాజెక్టులు నిర్మించడం కేసీఆర్‌కు తగదంటూ ఆరోపణలకు దిగారు. ఈ ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి వారి వద్ద అనుమతులు ఉన్నాయా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. నీటి సమస్యలు ఏర్పడకుండా రెండు రాష్టాల్రు ఎవరి వాటాను వారు వినియోగించుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కడుతోందని, దాని వల్ల రాష్ట్రం ఎడారిగా మారే ప్రమాదం ఉందని  జగన్‌ ఆందోళన వ్యక్తం చేయడంలో అర్థం లేదన్న విసయం అందరికీ తెలుసు. మహబూబ్‌నగర్‌లోనే 120 టీఎంసీల నీటిని మళ్లిస్తే శ్రీశైలం ప్రాజెక్ట్‌కు నీరు ఎలా వస్తుందన్నారు. పాలమూరు, డిండి ప్రాజెక్టుల పేరుతో రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీటిని తీసుకుపోవాలని చూస్తున్నారని, దీని వల్ల రాయలసీమతో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సైతం నీరు అందదని చెప్పుకొచ్చారు. ఎగువన ఉన్న మహార్రాష్ట, కర్ణాటక ప్రాజెక్ట్‌లు కట్టడం వల్ల దిగువ రాష్టాల్రకు నీరు రావడం లేదని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఆనాడు ఈ ప్రాజెక్టులుకాంగ్రెస్‌ హయాంలోనే నిర్మించారు. కానీ వీటిపై ఏనాడు పోరాటం చేయని జగన్‌ ఇప్పుడే పోరాటం చేయాలనుకోవడం ఆయన /-వార్థం తప్ప మరోటి లేదు. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులపై కేంద్రం తక్షణమే స్పందించాలని, లేకపోతే విద్వేషాలు పెరిగే అవకాశముందని చేసిన వ్యాఖ్యలుకావాలని హెచ్చరించేలా,రెచ్చగొట్టేలా ఉన్నాయి.  ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక జలదోపిడీ చేసేవని, రాష్ట్రం విడిపోయిన తర్వాత జల దోపిడీకి తెలంగాణ తోడైందని తెలిపారు. శ్రీశైలంలోకి కృష్ణా నీరు రాకముందే పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణాలను చేపట్టి కేసీఆర్‌ ప్రభుత్వం నీటిని అడ్డుకుంటోందని తెలిపారు. శ్రీశైలంలోకి నీరు రాకపోతే రాయలసీమకు సాగునీరు కాదు కదా తాగడానికి గుక్కెడు నీరు కూడా దొరకదని చెప్పారు. దీనిపై జగన్‌ పూర్తిగా అవగాహన లేకుండా చేస్తున్న ఆరోపణలుగా చూడాలి. జగన్‌ ఇప్పటికైనా కనువిప్పు తెచ్చుకుని సాగితే మంచిది. లేకుంటే వైకాపా పూర్తిగా అంతర్ధానం కాగలదని గుర్తుంచుకోవాలి.