ఇష్టపడి చదివితే లక్ష్యం సాధించడం సులభం. ఘనంగా కోటగిరి ప్రభుత్వ కళాశాల వార్షికోత్సవ వేడుకలు.

 

 

 

 

 

 

ముఖ్యఅతిథిగా హాజరైన డిఐఈఓ రఘురాజ్కోటగిరి జనవరి 31 జనం సాక్షి:-విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే లక్ష్యాన్ని సాధించవచ్చనీ డిఐఈఓ రఘురాజ్ పేర్కొన్నారు.మంగళవారం కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 23 వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ప్రతి ఒక్కరు ఒక నిర్ణీతమైన గమ్యాన్ని ఏర్పాటు చేసుకొని ప్రణాళిక బద్ధంగా చదివి ఉన్నత స్థానాలను చేరుకొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు.ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు తమ కళాశాల ఐఎస్ఓ గుర్తింపు కలిగిన కళాశాలగా గర్వంగా చెప్పుకోవాలని అన్నారు. జూనియర్ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కార బహుమతులను అందజేశారు.ఉదయం 10 గంటలనుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కళాశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన సాంస్కృతి క కార్యక్రమాలు మిన్నంటాయి.ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ అనిల్ కుమార్,వర్ని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ రవి కుమార్,కామర్స్ లెక్చరర్ శ్రీనివాస్,మోటివేటర్ ఆదిత్య,కళాశాల లెక్చరర్స్ రిజ్వానాసమీరా,రవీందర్,గిరి,ప్రభాకర్,వెంకట్,శ్రీధర్, దత్తాత్రి,సిబ్బంది,విద్యార్థినీ, విద్యార్థులు,తల్లిదండ్రులు,తదితరులు పాల్గొన్నారు