ఇస్రోశాస్త్రవేత్తలకు శుభాకాంక్ష వెల్లువ

అభినందించిన రాష్ట్రపతి,ప్రధాని, సిఎం కెసిఆర్‌
130కోట్ల భారతీయులకు గర్వకారణం అన్న మోడీ
ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన పార్లమెంట్‌
న్యూఢిల్లీ,జూలై22(జ‌నంసాక్షి): ‘ప్రతి భారతీయుడు అత్యంత గర్వపడే రోజు ఇది’ అని చంద్రయాన్‌ 2 ప్రయోగం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) విూద ప్రశంసలు కురిపించారు. జాబిల్లిపై పరిశోధనల కోసం చంద్రయాన్‌ 2 ఉపగ్రహాన్ని ఇస్రో సోమవారం శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది. దానిపై వరస ట్వీట్లతో మోదీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
‘మన చరిత్రలో అద్భుతమైన క్షణాలు ఇవి! చంద్రయాన్‌ 2 ప్రయోగం మన శాస్త్రవేత్తల నైపుణ్యాన్ని, శాస్త్ర రంగంలో కొంత పుంతలు తొక్కాలన్న 130 కోట్ల మంది దేశ ప్రజల నిబద్ధతను చూపిస్తోంది. ప్రతి భారతీయుడు ఈ రోజు చాలా గర్వంగా ఉన్నాడు. మనసులో, స్ఫూర్తిలో భారతీయత తొణికసలాడింది. చంద్రయాన్‌ 2 ప్రయోగానికి కృతజ్ఞతలు. దీని వల్ల చందమామకు సంబంధించి మన పరిజ్ఞానం మరింత మెరుగుకానుంది’ అని మోదీ ట్వీట్లు చేశారు.చంద్రయాన్‌ 2 పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం ఈ రోజు ప్రతి భారతీయుడి ఆనందానికి అత్యంత ముఖ్యకారణం. రిమోట్‌ సెన్సింగ్‌ కోసం ఆర్బిటార్‌, చంద్రుడి ఉపరితలాన్ని విశ్లేషించడానికి లాండర్‌-రోవర్‌ ఈ మిషన్‌లో ఉన్నాయి. జాబిల్లి దక్షిణ ధ్రువం విూద పరిశోధనలు చేయడమే ఈ ప్రయోగం ప్రధానోద్దేశం. గతంలో ఏ మిషన్‌ అక్కడ పరిశోధనలు చేయలేదు. దీనివల్ల వల్ల కొత్త విషయాలు తెలుసుకోనున్నాం. ఈ ప్రయోగానికి సంబంధించిన పరిశోధనలు యువతను శాస్త్రరంగం, పరిశోధన, ఆవిష్కరణల వైపు దృష్టి సారించేలా చేస్తాయి.  చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్రమంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఆయా రాష్ట్రాల సీఎంలు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతం మన శాస్త్రవేత్తల  శక్తిని తెలియజేస్తుందని ఉభయసభల్లో అభినందనలు తెలిపారు. రాజ్యసభలో వెంకయ్యనాయుడు, లోక్‌సభలో ఓంబిర్లాలు ప్రకటన చేశారు. ఈ మేరకు సభ్యులు చప్పట్లతో అభినందనలు తెలిపారు.  చంద్రయాన్‌-2 పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది.. దీనికి ప్రతి భారతీయుడు సంతోషించాలి. రోవర్‌ చంద్రుని ఉపరితలంపై పదార్థాలను విశ్లేషించనుంది అని పేర్కొన్నారు. చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతమవడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తల అనితర సాధ్యమైన కృషి వల్లే చంద్రయాన్‌-2 విజయవంతమైందని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల కఠోర శ్రమను, ప్రతిభాపాటవాలను సీఎం కేసీఆర్‌ కొనియాడారు. శ్రీహరికోట లోని షార్‌ కేంద్రం నుంచి ళ మధ్యాహ్నం 2:43 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఆ తర్వాత 16 నిమిషాల 13 సెకన్ల పాటు జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 ఎం1 ప్రయాణించింది. అనంతరం 39,059 కి.విూ. ఎత్తులో ఉన్న భూకక్ష్యలో చంద్రయాన్‌-2ను వాహననౌక విడిచిపెట్టింది. 5 రోజుల తర్వాత భూనియంత్రిత కక్ష్యలోకి చంద్రయాన్‌-2 ఉపగ్రహం ప్రవేశించనుంది.