ఈ నెల 28 న ప్రైవేట్ పాఠశాలల బంద్ కు సహకరించాలి

ట్రస్మా జిల్లా అధ్యక్షుడు జయసింహ గౌడ్
నిజామాబాద్ బ్యూరో,సెప్టెంబర్26(జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న సమస్యలను పరిష్కరించకుండా కొత్త కొత్త సమస్యలను తెరపైకి తీసుకువచ్చి ప్రైవేటు పాఠశాల ను ఇబ్బందులకు గురిచేస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఎనిమిది న జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు   పాటించి సహకరించాలని జిల్లా అధ్యక్షుడు జయసింహా గౌడ్ కోరారు ఈ మేరకు బుధవారం నగరంలోని ఆర్అండ్బి అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షడు జయసింహా గౌడ్ మాట్లాడుతూ..చిన్న బడ్జెట్ పాఠశాలలు సాధక బాధకాలను తెలియజేస్తూ అధికారులకు శాసనసభ్యులకు మంత్రులకు ఉప ముఖ్యమంత్రులకు పార్లమెంట్ సభ్యులతో సహా గత నాలుగు సంవత్సరాల నుండి ఎన్నో వినతిపత్రాలను అందజేసి మరెన్నో సార్లు చర్చల్లో పాల్గొన్న తమ సమస్యలను పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అదే విధంగా గత ప్రభుత్వాలు దేశంలో అక్షరాస్యతను పెంచే ఉద్దేశ్యంతో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని ప్రైవేటు రంగంలో పాఠశాలల స్థాపన నిర్వహణకు అనుమతులను ఇచ్చి ప్రోత్సహించాలని తద్వారా మన ఉమ్మడి రాష్ట్రాల్లో అక్షరాస్యత శాతం అధికంగా పెరిగింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదిహేను వేలకు పైగా చిన్న బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు ఉండగా సుమారు నలభై లక్షలకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉండగా నాలుగు లక్షలకు పైగా ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్యార్థులకు న్యాయమైన విద్యను అతి తక్కువ ఖర్చుతో అందిస్తూ నిరంతరం తమ పాఠశాలలు శ్రమిస్తున్న విషయం అందరికీ తెలిసింది దానికి తార్కాణం ప్రతి సంవత్సరం పదవ తరగతిలో అత్యధిక పదికి పది శాతం ఫలితాలు సాధిస్తున్నది ప్రైవేట్ పాఠశాలల విద్యార్ధులేనని ఆయన తెలిపారు
ఉన్నత విద్యను అభ్యసిస్తూ డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు ఇతర ఉన్నత ఉద్యోగాల్లో దేశ విదేశాల్లో స్థిరపడిన వారెందరో ప్రైవేట్ పాఠశాలల్లో చదివినవారే అని కొనియాడరు. అంతెందుకు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇలా అన్ని వర్గాల పిల్లలు ప్రైవేటు పాఠశాలల్లోనే చదువుతున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ గుర్తింపు పొంది ఉన్న పాఠశాలలకు ఎలాంటి నిబంధనలు లేకుండా గతంలో రిని వాల్స్ చేయాలని సామాజిక దృక్పథంతో నడుపుతున్న తమ పాఠశాలలకు విద్యుత్ బిల్లులను ప్రాపర్టీ ట్యాక్స్లను డొమస్టిక్ కేటగిరిలోనే నిర్ణయిస్తూ వృత్తి పన్ను ఇతర పన్నుల నుండి మినహాయించాలన్నారు. తమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగులకు హెల్త్ కార్డులు డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించిన నిధుల నుండి ప్రతి విద్యార్థి చదువు నిమిత్తం సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు తల్లిదండ్రులకు ఖాతాకు జమచేసి వారికి నచ్చిన పాఠశాలలో చదువుతునే అవకాశం కల్పించాలని కోరారు. కావున తమ సమస్యల పరిష్కారానికై ఈ నెల 28 తలపెట్టిన పాఠశాలల బంద్ను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు మామిడాల మోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుందర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ధర్మరాజు జిల్లా కోశాధికారి నిత్యానంద్ పట్టణ అధ్యక్షులు నరసింహారావు, గోపి ప్రవీణ్ నారాగౌడ్ కట్ట గోవర్ధన్లతో పాటు పట్టణంలోని వివిధ పాఠశాలల యాజమాన్యాలు పాల్గొన్నారు