ఈ- మార్కెటింగ్‌దే పైచేయి

ఖమ్మం,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): భవిష్యత్తులో ఈ-మార్కెటింగ్‌ వ్యవస్థ అభివృద్ధి చెందనున్నందున దీని ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని జిల్లా పౌరసరఫరాల అధికారులు అన్నారు. నగదురహితలావాదేవీలు, ఇ- మార్కెటింగ్‌ కీలక భూమిక పోషిస్తాయని అన్నారు. ప్రైవేట్‌ రైస్‌ మిల్లుల నుంచి ప్రభుత్వానికి వచ్చే బియ్యాన్ని స్టాక్‌ పెట్టేందుకు జిల్లాలో బూర్గంపహాడ్‌, కొత్తగూడెం, దమ్మపేటలలో ఎస్‌డబ్ల్యూసీ స్టాక్‌ పాయింట్లను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అదే విధంగా రైతులు తమ పంటల విక్రయాలను మార్కెటింగ్‌ వ్యవస్థ ద్వారా జరపాలని సూచించారు. జిల్లాలోని రైతుల శ్రేయస్సు కోసం కృషిచేస్తామని అన్నారు.