ఉగ్రవాదులతో చర్చలుండవు: రావత్‌

చంఢీఘడ్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): ఉగ్రవాదులు, ప్రభుత్వం మధ్య చర్చలు ఏవిూ ఉండవని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. సోమవారం ఆయన ఓ మిలిటరీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కశ్మీరు వేర్పాటువాదులు.. కేంద్ర ప్రభుత్వం నియమించిన మధ్యవర్తితో మాట్లాడాలన్నారు. కశ్మీర్‌ అంశంపై నియమించిన మధ్యవర్తి అందరితోనూ మాట్లాడుతున్నారని ఆర్మీ చీఫ్‌ తెలిపారు. కశ్మీర్‌ వేర్పాటువాదులు ముందుకు రాకుంటే ఆ అంశంలో ఎటువంటి ప్రగతి ఉండదని ఆయన అన్నారు. ఉగ్రవాదులతో ప్రభుత్వాధికారులు ఎవరూ మాట్లాడబోరని, అలాంటి సంఘటనలు ఏవిూ ఉండవని బిపిన్‌ రావత్‌ తెలిపారు. పంజాబ్‌లో తీవ్రవాదానికి ప్రయత్నిస్తున్న వారిని అదుపు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. పంజాబ్‌లో ఎవరైనా హింసకు ప్రేరేపిస్తే వారిని అడ్డుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు రావత్‌ తెలిపారు.