ఉచితంగా ఫిజియోథెరఫీ సేవలు

హ్యుమానిటీ ఫౌండేషన్‌ ప్రకటన

హైదరాబాద్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా పేదలు, అనాథలకు ఉచిత ఫిజియోథెరపీ వైద్యసేవలను అందించనున్నట్లు హ్యుమానిటీ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కొండ శ్రీనివాస్‌రావు తెలిపారు. నగరంలోని కాచిగూడలోని హ్యుమానిటీ ఫౌండేషన్‌ కార్యాలయంలో విూడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. గత 27 సంవత్సరాలుగా వేలమంది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్యసేవలను అందిస్తూ, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఫీవర్‌ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఫిజియోథెరపీ సెంటర్‌లో ప్రతిరోజు అత్యధునిక పరికరాలతో షుగర్‌, బీపీ, థైరాడ్‌, కీళ్ల నొప్పులకు, మోకాళ్ల నొప్పులు, నడుము, మెడ, లావు, పొట్ట తగ్గడానికి, నరాలకు సంబంధించిన వ్యాధులు, షుగర్‌, బీఎంఐ టెస్టులు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే రోగులకు ఫిజియోథెరపీ చికిత్సతో ఉచితంగా మ్బైల్‌ సర్వీస్‌ ద్వారానే ఇంటి వద్దనే వైద్య సేవలను అందించనున్నట్లు ఆపేర్కొన్నారు. ఆపాదలో ఉన్నవారిని అదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఈ ఫిజియోథెరపీ వైద్యశిబిరాన్ని ఇప్పటి వరకు వేలాదిమంది రోగులు సద్వినియోగం చేసుకున్నారని పేర్కొన్నారు. అవకాశాన్ని తెలంగాణలోని పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వివరాలకు 9949238492, ఫివర్‌ ఆసుపత్రి ఎదురుగా ఉన్న హ్యుమానిటీ ఫౌండేషన్‌లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.