ఉద్యోగాల భర్తీలో అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి

మున్సిపల్ చైర్మన్ రాజీనామా కోరుతూ భాజపా ఆందోళన
నిర్మల్ బ్యూరో, మే24,జనంసాక్షి,, నిర్మల్ మున్సిపాలిటీలో ఉద్యోగాల భర్తీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని,వాటిని రద్దుచేసి ,అక్రమాలకు పాల్పడ్డ మున్సిపల్ చైర్మెన్ వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు మంగళవారం మున్సిపల్ కార్యాలయన్నీ ముట్టడించారు. ఈసందర్భంగా భాజాపా నాయకులను,కార్యకర్తలను పోలీసులు మున్సిపల్ కార్యాలయంలో నికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో నాయకులకు పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులను ఛేదించి లోపలికి వెళ్లేందుకు బారిసంఖ్యలో భాజాపా శ్రేణులు చేరుకున్నాయి.సంఘటన స్థలానికి డిస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి చేరుకుని నాయకుల ను,కార్యకర్తలను వాహనంలో పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈసందర్భంగా నాయకులు మెడిసెమ్మె రాజు,రావుల రాంనాథ్,డా,,మల్లికార్జున రెడ్డి,సాదం అరవింద్ లు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యాగాల నియామకాల్లో కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని, అర్హులకు కాకుండా అనర్హులకు ఉద్యోగ నియమాకాలు చేపట్టారని,ఆరోపించారు, మున్సిపల్ చైర్మన్ తన కూతురు,అల్లుడు, బంధువులకు నియమించారని అన్నారు.ఎందరో మంది నిరుద్యోగులు కొరకు అప్లై చేసుకున్నారని,అర్హులని కాదని డబ్బులు తీసుకొని అక్రమంగా నియామకాలు చేపట్టారని ఆరోపించారు.మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సహకారం తోనే మున్సిపల్ చైర్మన్ అవినీతి కి పాల్పడ్డారనిఅన్నారు.  అక్రమాలపై సీబీ సిఐడి చే  విచారణ జరిపించి ఆర్ఝులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.లేనియెడల పెద్దమొత్తంలో ఆందోళన చేయాడుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో నాయకులు ఒడిసెల అర్జున్, గాదె విలాస్, కొందాజి శ్రావణ్,అల్లం భాస్కర్,పొన్నం నారాయణ గౌడ్,తదితరులు పాల్గొన్నారు