ఉపాధి పనుల్లో అక్రమాలకు చెక్‌

స్థానిక అవరాలకు అనుగుణంగా పనులు

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ఉపాధి పనుల్లో అక్రమాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని జిల్లా గ్రావిూణాభివృధ్ధిశాఖాధికారి స్పష్టం చేశారు. పనుల విభజన మొదలు వివిధ పనులను అవసరం ఉన్న మేరకు తీసుకుంటున్నామని అన్నారు. పక్కాగా పనులకు సంబంధించి ప్రణాళిక చేపట్టి, ఉపాధిహావిూ పథకం ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. రైతులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహావిూ క్షేత్రసహాయకులను సంప్రదించి వీటిని ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ పథకలను రైతులు వినియోగించుకోవాలని అన్నారు. ఈ పథకం ద్వారా కూరగాయల పందిళ్లు, శ్మశానవాటికలు, పశువులపాకలు, నీటితొట్టెలు, నాడెపు కంపోస్టులు, మల్బరితోటలు, ఇంకుడుగుంతల నిర్మాణం, మట్టికట్టలు వేయుట, సమతల కందకాలు తవ్వటం, వూటకుంటలు, పండ్లతోటల పెంపకం, వర్షపునీరు నిల్వచేసే కట్టడాలు, నర్సరీల పెంపకం, గ్రామాల్లో ఆటస్థలాలు, సీసీ రోడ్ల నిర్మాణం, పాఠశాలల్లో కిచెన్‌షెడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు ఇతరాత్ర చాలా వరకు ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. వీటిని పూర్తిగా వందశాతం రాయితీతో ఏర్పాటు చేసుకునే సౌలభ్యం ఉంటుందని పేర్కొన్నారు.