ఉపాధ్యాయులకు సబ్జక్ట్‌ శిక్షణ

మహబూబ్‌నగర్‌,జూన్‌8(జ‌నం సాక్షి): ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు ప్రైవేట్‌ పాఠశాలలతో ధీటుగా సబ్జక్టులు బోధించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనికోసం టీచర్లకు ముందస్తు శిక్షణ ఇస్తున్నారు.ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో బోధిస్తున్న గణితం, భౌతిక, రసాయన, జీవ, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవడం ద్వారా పిల్లలకు మంచి విద్యను అందించాలని చూస్తున్నారు.ఈ మేరకు పాలమూరు జిల్లాలో శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.శిక్షణకు వచ్చే సమయంలో ఉపాధ్యాయులు పాఠ్య పుస్తకాలు, పాఠ్య ప్రణాళిక, ప్రాజెక్టు నివేదికలు తీసుకు రావాలని కోరారు.