ఉప్పల్‌లో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

హైదరాబాద్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడి బుద్ధీ వంకరగా మారింది. పాఠాలు చెప్తాడేమోనని అనుకున్న విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థిని బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఉప్పల్ భరత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఓ విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ విద్యార్థిని విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు విద్యార్థి సంఘాలతో కలిసి స్కూల్ ఎదుట ధర్నా చేస్తున్నారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుని, పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.