ఉభయ జిల్లాల్లో జోరుగా డబుల్‌ ఇళ్లు

పూర్తి కావస్తున్న నిర్మాణాలు
ఖమ్మం,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): పేదలకు అందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న సీఎం కెసిఆర్‌ ఆకాంక్ష మేరకు  డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలుజోరుగా సాగుతున్నాయి.  ఈ క్రమంలో కోట్లాది రూపాయలు వెచ్చించి డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. గత తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఇంటి నిర్మాణాలు ప్రారంభం కాగా, రెండవ దఫా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రావడంతో మళ్లీ ఈ డబుల్‌బెడ్‌రూం ఇళ్‌ల్ల నిర్మాణాలు ఊ పందుకున్నాయి. ఇప్పటికే కొంత మంది పేదలు ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని ఇళ్లు కూడా గృహప్రవేశాలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పేదలు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఉభయ జిల్లాల్లో ఇళ్ల నిర్మాణం ఊపందుకుంది. భద్రాచలం, పినపాక, ఇ/-లలెందు, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాల పరిధిలో మొత్తం 4,218 డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు మంజూరయ్యాయి. భద్రాచలం ఐటీడీఏ ఇంజనీరింగ్‌శాఖ ఆధ్వర్యంలో ఈ డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. భద్రాచలం నియోజకవర్గంలో 700 లు మొత్తం 958 డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు మం జూరయ్యాయి. ఇలా రెండు జిల్లాల్లో 4218 డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.
22862.02 కోట్ల రూపాయలు ఇందుకోసం ప్రభుత్వం వెచ్చిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా పరిధిలో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం ఊపందుకుంది. ఇప్పటికే 1449 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. పలు నిర్మాణాలు టెండర్ల దశలో ఉన్నట్లు భద్రాచలం ఐటీడీఏ ఈఈ కోటిరెడ్డి తెలిపారు. స్థల సమస్యతో కొన్ని చోట్ల డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మాణాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు వివరించారు.