ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దంచికొట్టిన వరుణుడు

– జిల్లాలో అత్యధికంగా 1766.08 మి.విూ వర్షపాతం నమోదు

– కిన్నెరసానికి పోటెత్తిన భారీ వరద

– 9గేట్లు ఎత్తి 50వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల

ఖమ్మం,ఆగస్టు11(జ‌నం సాక్షి): ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైన వర్షం శనివారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు చెరువులు, కుంటలు పొంగిపోయాయి..శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచి ప్రజలు, వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఖమ్మం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వైరా, ఏన్కూర్‌, కొణిజర్ల, తల్లాడ, మధర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు పత్తి పంట నీట మునిగింది. భారీ వర్షాలకు వైరా రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వర్షపు నీరు చేరడంతో సత్తుపల్లి జేవీఆర్‌ ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకూ 1766.08 మివిూ వర్షపాతం నమోదు అయ్యింది. అలాగే నేలకొండపల్లిలో 253.8 మిల్లీవిూటర్లు, ముదిగొండలో 226.4 మిల్లీవిూటర్లు, ఖమ్మం అర్బన్‌ మండలంలో 128.2 మిల్లీవిూటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మరోవైపు భారీ వర్షాలకు మణుగూరు కోడిపుంజుల వాగు ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. మరోవైపు భారీ వర్షాలకు మణుగూరు కోడిపుంజుల వాగు ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. కూసుమంచి మండలం నర్సింహులగూడెంలో నల్లకుంట వాగు పొంగుతోంది. దీంతో నర్సింహులగూడెం – పోచారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముదిగొండ మండలం చిరిమరిలో చెరువు అలుగు పొంగి ఇళ్లలోకి నీరు చేరింది. రహదారిపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నేలకొండపల్లి మండలం ఆరెగూడెంలో చెరువుకట్ట తెగి పోయింది. 150 ఎకరాల పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. ఖమ్మం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వైరా, ఏన్కూర్‌, కొణిజర్ల, తల్లాడ, మధర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు పత్తి పంట నీట మునిగింది. భారీ వర్షాలకు వైరా రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వర్షపు నీరు చేరడంతో సత్తుపల్లి జేవీఆర్‌ ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భారీ వర్షాలకు పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజుక్టుకు వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తడంతో.. 9 గేట్లు ఎత్తి దిగువకు 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కిన్నెరసాని ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 50 వేల క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఫ్లో 50 వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 406.8 అడుగులు. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు నాలుగు గేట్లను ఎత్తివేసి 5200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు ఇల్లందు ఏజెన్సీ ప్రాంతాల్లో గత రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మల్లనవాగు, జల్లేరు, ఏడుమెలకలవాగు, కిన్నెరసాని వాగులు పొంగిపొర్లుతుండటంతో ఆదివాసీ పల్లెలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. అటు ఇల్లందు, కోయాగుడెం ఓపెన్‌ కాస్ట్‌ గనులలోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి

నిలిచిపోయింది.