ఉమ్మడి జిల్లా బాధ్యతలను పర్యవేక్షిస్తున్న మంత్రులు

జనాలను తరలించేందుకు రూట్‌ మ్యాప్‌ సిద్దం

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌31(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సెప్టెంబర్‌ 2న కొంగరకలాన్‌లో నిర్వహించే ప్రగతి నివేదన బహిరంగ సభకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి భారీ జనసవిూకరణ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎక్కడెక్కడి నుంచి ఎంతమందిని ఎలా తీసుకుని రావాలన్న దానికి రూట్‌ మ్యాప్‌ సిద్దం చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి కనీసం లక్ష మందికి తగ్గకుండా జనసవిూకరణ చేసేందుకు నేతలు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఇద్దరు మం త్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీ, మిగతా ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు. ఇప్పటికే మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో జనసవిూకరణపై సవిూక్షించి పక్కా ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లలో ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులు మండలాల వారీగా జన సవిూకరణపై దృష్టి సారించారు. జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 10 వేల మంది చొప్పున జనసవిూకరణ చేయాలని నిర్ణయించారు. తమ నియోజకవర్గంలోని ఆయా మండలాలు, గ్రామాల వారీగా జన సవిూకరణపై దృష్టి సారించారు. ఇప్పటికే మండలాల వారీగా ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇక గ్రామాల వారీగా జనసవిూకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. తమ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, రైతు సమన్వయ సమితి కన్వీనర్లు, ఇతర జిల్లా, నియోజకవర్గ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులతో సవిూక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామాలు, మండలాల వారీగా పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి జిల్లాలో లక్ష మందికి తగ్గకుండా.. జన సవిూకరణ చేసేందుకు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఆర్టీసీ, ప్రైవేటు పాఠశాల ల బస్సులను మాట్లాడారు. మరోవైపు ప్రైవేటు ట్యాక్సీ వాహనాలు, ఐచర్లు, ఇతర వాహనాలను అద్దెకు తీసుకుంటున్నా రు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తమ సొంత వాహనాల్లో వచ్చేందుకు నిర్ణయించారు.