ఎంపీలు నాలుగైదు జిల్లాలకు తిరగాల్సి వస్తుంది

– అసెంబ్లీలో బీజేపీఎల్‌పీ నేత కిషన్‌ రెడ్డి
హైదరాబాద్‌, నవంబర్‌17(జ‌నంసాక్షి) : జిల్లాల విభజన తర్వాత ఓ పార్లమెంట్‌ స్థానం నాలుగైదు జిల్లాలకు విభజన జరిగిందని, దాని వల్ల ఎంపీలు ఐదారు జిల్లాలకు తిరిగి కలెక్టర్లతో మాట్లాడాల్సి వస్తోందని బీజేపీఎల్‌పీ నేత కిషన్‌ రెడ్డి అన్నారు శుక్రవారం శాసనసభలో పాలన సంస్కరణలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాల విభజన జరిగి ఏడాది దాటినా అధికారుల భర్తీ పూర్తి కాలేదని. అన్ని శాఖల్లో సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కొత్తగా ఏర్పడిన వరంగల్‌ రూరల్‌ జిల్లా కేంద్ర ఎక్కడ ఏర్పాటు చేస్తారో క్లారిటీ లేదని పేర్కొన్నారు. రియల్‌ ఎస్టేట్‌కు అనుకూలంగా స్థలల  సేకరణ జరగొద్దని అయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు అందరికంటే ముందు మద్దతిచ్చింది బీజేపీనేనని అన్నారు. జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయత లోపించిందని.. భౌగోళిక ప్రాంతాలను పట్టించుకోకుండా విభజన జరిగిందన్నారు. పాలన వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి జరుతుందని స్పష్టం చేశారు.