ఎంసెట్‌లో బాలురదే హవా

1

– ఫలితాలు వెల్లడించిన కడియం

హైదరాబాద్‌,మే26(జనంసాక్షి): తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హైదరాబాద్‌లో ఫలితాలు ప్రకటించారు. ఎంసెట్‌ పరీక్షను ఈనెల 15న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎంసెట్‌లో 77.88 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. ఇంజినీరింగ్‌, వ్యవసాయ సంబంధ కోర్సులకు సంబంధించి మాత్రమే ఫలితాలు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు జూన్‌ 6 నుంచి ర్యాంక్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

ఇంజినీరింగ్‌ విభాగంలో 1,33,428 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థులు జూన్‌ 6వ తేదీనుంచి ర్యాంక్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొదటి పది స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి. మొదటి ర్యాంకు- తళ్లూరి సాయితేజ(160/160),రెండవ ర్యాంకు- దిగుమర్తి చేతన్‌సాయి(159/160),మూడవ ర్యాంకు- గుండా నిఖిల్‌ సామ్రాట్‌(158/160), నాల్గొవ ర్యాంకు- కొండా విఘ్నేశ్‌రెడ్డి(158/160), ఐదవ ర్యాంకు- చుండూరు రాహుల్‌(158/160), ఆరోర్యాంకు- బండారు వెంకటసాయి గణెళిష్‌(157/160), ఏడవ ర్యాంకు- కొండేటి తన్మయి(157//160), ఎనిమిదవ ర్యాంకు- గంటా గౌతమ్‌(157/160), తొమ్మిదవ ర్యాంకు- నంబూరి జయకృష్ణ సాయివినయ్‌(157/160), పదవ ర్యాంకు- సత్తి వంశీ కృష్ణారెడ్డి(157/160)లు దక్కించుకున్నారు.