ఎగ్జిట్‌ పోల్స్‌పై నేతల్లో అసహనం

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల తీరు ఎలా ఉన్నా, తాము ఊహించిన విధంగా ఫలితాలు లేవన్న పార్టీల్లో సణుగుడు మొదలయ్యింది. ఇవి ప్రజల నాడిని పట్టలేకపోయాయని చంద్రబాబు, మమతాబెనర్జీ లాంటి వారు అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. అయితే గతంలో కూడా ఎగ్జిట్‌ పోల్స్‌ ఎగ్జాట్‌ ఫలితాలుగా రాని కారణంగానే వీరిలో ఇంకా అనుమానాలు ఉన్నాయి. 23న ఫలితాలు లెక్కిస్తే తప్ప అసలు విషయం బయటపడదు. అయితే అన్ని సర్వేలు మాత్రం ఓ విషయాన్ని కొద్దిగా దగ్గరగా తేల్చిన విషయం ఏమంటే ఎన్‌డిఎకు మళ్లీ అధికారం ఖాయమని. ఈ విషయంలో కొన్నిసీట్లు అటుఇటుగా ఉన్నా..ఎన్‌డిఎదే అధికారమని తేల్చాయి. ఇక ఎపి విషయంలో అక్కడ ప్రభుత్వం ఎవరిదన్నదాని విషయంలో భిన్నాభిప్రయాలు వచ్చాయి. మళ్లీ టిడిపి వస్తుందా లేక వైకాపా పాగా వేస్తుందా అన్న స్పష్టత ఏ రెండు సర్వేల్లోను కనిపించలేదు. అందుకే కాబోలు చంద్రబాబు సర్వేలపై పెద్దగా పట్టించుకోలేదు. అలాగే పెద్దగా స్పందించలేదు. ఇవి ఎగ్జాట్‌ కాదన్నారు. ప్రజలనాడికి దగ్గరగా లేవన్నారు. చివరి వరకు యూపిఎను పట్టుకుని ఆయన మంతనాలు సాగిస్తూనే ఉన్నారు. మిగతా నేతలు నింపాదిగా ఉంటే చందరబాబు మాత్రమే నేతలందరిని కలుస్తూ హడావిడి చేస్తున్నారు. మమతా బెనర్జీ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఇకపోతే మోడీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్న విషంయం తేలినందున,ఎపిలో అధికారంలోకి రాకపోతే రాబోయే రోజుల్లో  చంద్రబాకు గడ్డుకాలం తప్పకపోవచ్చు. ఇకపోతే మోడీకి మూడిందని ఇంతకాలం ప్రచారం సాగించిన వారికి కూడా ఎగ్జిట్‌ పోల్స్‌ రుచించడం లేదు. ఎందుకంటే మోడీని ఇంటికి పంపుతున్నామని అన్నవారంతా ఖంగుతినేలా ఎగ్జిట్‌ ఫలితాలు ఉన్నాయి. పశ్చమబంగాలో తుఫాన్‌ సమస్యపై చర్చించడానికి ప్రధాని మోడీ ఆహ్వానించినా మమతా బెనర్జీ తిరస్కరించారు. మూన్నాళ్ల ప్రధానితో తానేవిూ మాట్లాడే దంటూ అహంకారం ప్రదర్శించారు.  2014లో ప్రధాని పీఠాన్నిచ్చిన యూపీలో ఈసారి బీజేపీకి భారీ దెబ్బ తప్పదని అంచనా వేశారు. అక్కడ ఎస్పీ, బిఎస్పీ జోడీ మోడీని నిలువరిస్తుందని భావించారు. ప్రియాంక రాకతోఒ సీన్‌ మారుందని కాంగ్రెస్‌ కూడా భావించింది. మమత, అఖిలేశ్‌,మాయావతి, నవీన్‌ పట్నాయక్‌, స్టాలిన్‌ వంటి ప్రాంతీయ పార్టీల నేతలు బీజేపీ జోరును విజయవంతంగా అడ్డుకుంటారని ప్రచారం చేసుకున్నారు.  మొన్నటివరకు వెన్నంటి ఉన్న హిందీబెల్ట్‌ ఈసారి బీజేపీకి మొహం చాటేయడం ఖాయం అంటూ వీరంతా ఊదరగొట్టారు.  మోదీ మళ్లీ ప్రధాని కావడం దాదాపుగా అసంభవం.. మోదీ, అమిత్‌ షా ముఖంలో ఆ ఆందోళన స్పష్టంగా కనబడుతోంది.. ఇదీ ఏడు విడతల వారీగా జరిగిన  సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజకీయ విశ్లేషకులు వేసిన అంచనాలు. కానీ ఈ అంచనాలేవీ నిజం కాకపోవచ్చని.. మోదీ మరోసారి స్పష్టమైన మెజారిటీతో ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారని పోస్ట్‌పోల్‌ సర్వేలు స్పష్టం చేస్తు న్నాయి. కనీసం 300 సీట్లతో ఎన్డీయే రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబు తున్నాయి. కొంచెం అటుఇటుగా మళ్లీ ఎన్డీఎ అధికారం చేపట్టడం దాదాపు ఖాయం అయ్యింది. 23న ఓట్ల లెక్కింపులో సీట్లు ఎన్నన్నది తేలనుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీకే ప్రజామోదం ఉంటుందని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. మోదీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఆదివారం సాయంత్రం విడుదల చేసిన అంచనాల్లో పేర్కొన్నాయి. ఏడుదశల్లో ¬రా¬రీ గా జరిగిన పోరులో.. కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీల నుంచి తీవ్రమైన పోటీని తట్టుకుని మరీ మోదీ మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారని అభిప్రాయపడ్డాయి. ప్రధానిగా మోదీ పనితీరుకు, కాంగ్రెస్‌ పార్టీ పునరుజ్జీ వానికి, ప్రాంతీయ పార్టీల సత్తాకు అసలు సిసలు పరీక్షగా మారిన ఈ ఎన్నికల్లో ప్రజలు మోదీకే జై కొట్టబో
తున్నారని వెల్లడించాయి. దాదాపుగా అన్ని సంస్థల సర్వే ఫలితాల్లోనూ ఎన్డీయే మేజిక్‌ ఫిగర్‌ (272)ను దాటి స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని వెల్లడైంది. 2014 ఎన్నికల్లో దారుణ పరిస్థితులను ఎదుర్కొన్న కాంగ్రెస్‌ గతంలో కంటే కాస్త మెరుగుపడినా.. బీజేపీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదని సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికలు జరిగిన 542 స్థానాలకు గానూ బీజేపీ కూటమి దాదాపుగా 300 సీట్లు గెలుచుకుంటుందని.. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ 127 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని సూచించాయి. ఈ రెండు కూటముల్లో లేని ప్రాంతీయ పార్టీలు 115 స్థానాలను కైవసం చేసుకునే పరిస్థితి కనుబడుతోందని సర్వే ఫలితాలు విశ్లేషించాయి. మొత్తంగా ప్రాంతీయ పార్టీల హవా కూడా తగ్గిందనే చెప్పాలి. తమిళనాడులో డిఎంకె పుంజుకుంది. అలాగే బెంగాల్‌, ఒడిషాల్లో బిజెపి గట్టిపోటీని ఇచ్చింది. దీంతో అక్కడ మంచి సీట్లను బిజెపి సాధించబోతున్నది. ఇది ఆ పార్టీకి ఓ రకంగా ఊరట కలిగించే అంశం. ప్రధాని కావాలన్న రాహుల్‌ ప్రయత్నాలు ఫలించలేదన్న విషయం స్పష్టమైనా గతం కంటే కాంగ్రెస్‌ పరిస్తితి మెరుగైందని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు రుజువు చేస్తున్నాయి. అత్యంత కీలమైన మహారాష్ట్ర సహా హిందీ బెల్ట్‌లోని గుజరాత్‌, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్టాల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడిస్తున్నాయి. మోదీ వర్సెస్‌ దీదీ రణరంగంగా మారిన పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అనూహ్యంగా దూసుకుపోనుందని తృణమూల్‌కు గట్టిపోటీ ఇచ్చిందని సర్వేలు తెలియజేస్తున్నాయి.యూపీలో కోల్పోయే సీట్ల నష్టాన్ని పశ్చిమ బెంగాల్‌, ఒడిశా తదితర రాష్టాల్లో కొంతమేరనైనా పూడ్చుకోవాలన్న బీజేపీ ప్రయత్నాలు విజయవంతమయ్యే సూచనలు కనబడుతున్నాయి. మొత్తంగా 23న ఫలితాలు వెలువడితే అసలు రహస్యం తేలనుంది. ప్రజలు ఎవరిని వరించారన్నది తెలుస్తుంది. అప్పటి వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మని మమతా బెనర్జీ, చంద్రబాబు లాంటి నేతలు నిశ్చింతగా ఉండవచ్చు.