ఎన్నికలకు ఏనాడు భయపడడం లేదు

ముందే ఎన్నికలకు ఎందుకు వెళుతున్నారో చెప్పాలి: శ్రీధర్‌ బాబు

కరీంనగర్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డి.శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఐదేళ్లపాటు అధికారంలో ఉండాలని ప్రజలు తీర్పిస్తే ఇచ్చిన హావిూలను నిలబెట్టుకోలేక టీఆర్‌ఎస్‌ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచన చేయడం శోచనీయన్నారు. అయితే దీనిని తాము ప్రశ్నిస్తే ఎన్నికలకు భయపడుతున్నామని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ఎన్నికలకు వెళుతుందని, విజయం సాధిస్తుందని అన్నారు. డఅయితే ఇచ్చిన హావిూల మేరకు బుల్‌బెడ్‌రూం ఇళ్లు, భూపంపిణీ, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం హావిూలను అమలు చేయడంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని విమర్శించారు. ఇవే విషయానలు ప్రగతి సభలో చెప్పి ఎందుకు చేయలేకపోయారో చెప్పాలన్నారు.ప్రజలు వీటిపై నిలదీస్తారన్న భయంతోనే ప్రజలను తప్పుదోవపట్టించడంలో భాగంగా ముందస్తు ఎన్నికల ఫ్యూహాం పన్నుతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆవేదన, ఆరాటంను అర్థం చేసుకోకుండా ప్రభుత్వం ప్రగతినివేదన సభ ద్వారా అంకెల గారడి చేయడానికి సిద్ధమవుతోందని ఆరోపించారు.