ఎన్నికలు,గణతంత్ర వేడుకలు

బిజీగా జిల్లా అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం,జనవరి24(జ‌నంసాక్షి): ఓ వైపు పంచాయితీ ఎన్నికలు, మరోవైపు గణతంత్ర వేడుకలు కూడా రానుండడంతో జిల్లా అధికారులు వీటి నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రెండోవిడత 25న ఎన్నికలు జరుగున్నాయి. 26న గణతంత్ర వేడుకులు జరపాల్సి ఉంది. తరవాత 30న మూడో విడత ఎన్నికలు జరుగుతాయి. దీంతో జిల్లా అధికారులు బిజీగా విధుల్లో నిమగ్నమయ్యారు. దీంతో అధికారులు తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్‌ రజత్‌ శైనీ తెలిపారు. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్‌ జిల్లా అధికారులతో ఇప్పటికే సవిూక్షించారు. పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డీఈవో, డీపీఆర్‌ ఆదేశించారు. విద్యార్థులు ప్రదర్శించే నృత్యాలను పాటాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు కార్పెట్లు వేయాలని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పోలీస్‌, తహసీల్దార్‌ పర్యవేక్షించాలన్నారు. మైదానాన్ని పరిశుభ్రంగా ముస్తాబు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ సూచించారు. వేడుకల వీక్షణకు వచ్చే ప్రజలు కూర్చోవడానికి కుర్చీలు, షామియానాలు, మంచినీటి సరఫరా చేసేందుకు మైదానంలో ఏర్పాట్లు చేయాలన్నారు. స్టేజి ఏర్పాట్లు చేసి అందంగా పూలతో అలంకరించాలని ఆర్‌ అధికారులకు సూచించారు. ఐటీడీఏ, వ్యవసాయశాఖ, జిల్లా గ్రావిూణాభివృద్ధి సంస్థ, ఉద్యానవన శాఖ తదితర శాఖలతో పాటు వివిధ సంక్షేమ శాఖలు ఆయా శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, శాఖా పరంగా అమలు చేస్తు న్న పథకాలపై స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని, వీటిని ఏర్పాట్లను డీఆర్‌ పర్యవేక్షించాలని పేర్కొన్నారు.