ఎన్నికల కోసం సైనికుల్లా పనిచేయండి

మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు

జగిత్యాల,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): విపక్షాల కూటమిని ప్రజలు నమ్మరని, వారికి ఎన్నికలల్లో ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. అవాకులు, చెవాకులకు పేలుతున్న ప్రతిపక్షాలకు ప్రజా క్షేత్రంలో తగిన బుద్ది చెప్పేందుకు ఎన్నికలు రాబోతున్నాయన్నారు. నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ మేరకు కార్యకర్తలు సైనికుల్ల పనిచేయాలన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై విస్త్రృత ప్రచా రం చేయాలని సూచించారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కా ర్యకర్తకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వం పనిచేసిందనీ, ప్రతి ఒక్క కుటుంబం ఏదో ఒక పథకం ద్వారా లబ్దిపొందేలా ప్రభుత్వం సం క్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలతో పాటు చెప్పనివి ఎన్నో మానవీయ కోణం లో ఆలోచించి సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కంటి వెలుగు, రైతు బంధు, రైతులకు జీవిత బీమా, కేసీఆర్‌ కిట్లు, బాలికలకు ఆరోగ్య సంరక్షణ కిట్లు వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. దేశంలో మిగ తా రాష్ట్రాల కంటే అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రా ష్ట్రం ముందంజలో ఉందన్నారు.