ఎన్నికల సంస్కరణలు జరగాలి

ప్రధాని,నరేంద్రమోదీ, నీతిఆయోగ్‌ తాజాగా ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా అంతా జమిలి ఎన్నికలను కోరకుంటున్నారు. అందరూ ఓకేచెప్పారు. అయితే దీనికిముందు ఒకటి రెండు సంస్కరణలు కూడా జరగాల్సి ఉంది. అలా చేస్తే తప్ప మన ప్రజాస్వామ్యం మరితంగా బలపడదు. భారత ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ఒకరు ఎన్నిసార్లయినాఎన్నిక కావు. ఒకటికి మించి రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా, ఎంపిగా ఏకకాలం పోటీ చేయవచ్చు. ఒకసారి చట్టసభకు అడుగుపెడితే చచ్చే వరకు ఎన్నిక అయ్యే అకాశం ఉంది. దీనిని తొలుత సంస్కరించాల్సి ఉంది. గతంలో ఎన్టీఆర్‌ ఎపిలోని మూడా చోట్లనుంచి పోటీ చేశారు. తరవాత మల్ళీ ఉప ఎన్నికలు రావడం సర్వసాధారణం అయ్యాయి. ప్రధాని మోడీ గత ఎన్నికల్లో వారణాసి నుంచి, గుజరాత్‌ బరోడా నుంచి ఏకకాలంలో రెండు సీట్లకు పోటీ చేసి గెలుపొందారు. తరవాత వారణాసిని ఉంచుకుని బరోడాను వదిలేశారు. అలాగే తెలంగాణ సిఎం కెసిఆర్‌ గజ్వెల్‌ అసెంబ్లీ, మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తరవాత మెదక్‌ను వదులుకున్నారు. ఇలా చేయడం వల్ల ఒకటి ఉంచుకుని మిగతా దానికి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. దీంతో ఖర్చు ప్రజల పన్నుల నుంచే వెచ్చించాల్సి వచ్చింది. అలాగే ఎన్నిసార్లయినా పోటీ చేయకుండా ప్రతిబంధకం కూడా లేదు. ఉమ్మడి ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే ఇలాంటి వాటిని కూడా సరిచేసి చట్టబద్దం చేయాలి. వీటికి సంబంధించిన సంస్కరణలు రావాలి. అమెరికా అధ్యుక్షుల లాగా కనీసం రెండుసార్లకు మించి పోటీ చేయకుండా, ఒక్క చోటు నుంచి మాత్రమే పోటీ చేసేలా చట్టం చేయాలి. ఎంపి లేదా ఎమ్మెల్యేగా కేవలం రెండుసార్లు మాత్రమే పోటీ చేసే చట్టం ఉండాలి. అలా చేస్తే ఒక్కరే పలుమార్లు పోటీ చేసి గెలుపొంది తిష్టవేసుకునే ఆగత్యం ఏర్పడదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇప్పటికీ ఏకధాటిగా గెలుస్తూనే ఉన్నారు. 90వ పడిలో కూడా ఆయన అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నారు. రెండు టర్మ్‌ల నిబంధన వస్తే వృద్దులకు విశ్రాంతి దక్కడంతో పాటు యువకులకు అవకాశాలు పెరుగుతాయి. దేశంలో విప్లవాత్మక నిర్ణయాలకు వీలు కలుగుతుంది. అలాగే ఒక్కరే పెత్తనం చేసే అవకాశాలు పోతాయి. ఎన్నికల సంఘంలో ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు రావాలి. చట్టాలు తీసుకుని రావాలి. ఇప్పుడు పరిమిత కాలం అభ్యర్థుల ఎన్నికపై కూడా చట్టానికి రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలి. పనిలో పనిగా మహిళా బిల్లుకు మమ అనిపించాలి. అప్పుడే సంస్కరణలకు ఫలితం ఉంటుంది. ఇకపోతే ఉమ్మడి ఎన్నికల ప్రతిపాదన చర్చలో ఉండగానే బీహార్‌ ఎన్నికలు ఇటీవల యూపి ఎన్నికలు కూడా ముగిసాయి. తాజాగా హిమాచల్‌, గుజరాత్‌ ఎన్‌ఇనకలు జరుగనున్నాయి. మొత్తంగా గతేడాది పలు రాస్ట్రాల్లో ఎన్నికలు ముగిసాయి. అయితే ఉమ్మడి ఎన్నికలను ఎప్పుఉడ మొదలు పెడతారన్నది తేలాల్సి ఉంది. 2019లో కేంద్రంతో పాటు, తెలుగు రాష్టాల్ల్రో ఎన్‌ఇనకలు జరగాల్సి ఉంది. అప్పుడే జమిలి ఎన్నికలు మొదలు పెడితే ఏడాది క్రితం ఎన్నికలు జరుపుకున్న రాష్టాల్రను ఏం చేస్తారన్నది తెలియడం లేదు. ఏకకాల ఎన్నికలతో దేశానికి ఖర్చులు కలసి వస్తాయి. అన్ని పార్టీలూ ఓకే అంటే వచ్చే ఏడాది సెప్టెంబరు కల్లా జమిలి ఎన్నికలకు మేము తయారుగా ఉంటామని ఈసీ ప్రకటించడం తో అదే సమయానికి ఎన్నికలు జరగబోతున్నాయంటూ కథనాలు, వ్యాఖ్యానాలు కూడా మొదలైనాయి. జమిలి ఎన్నికలతో దేశాన్నంతా గుప్పిట్లోకి తెచ్చుకోవచ్చునన్న అధికారపార్టీ బిజెపి ఆలోచనకు మిగతా పార్టీలు గండి కొడతాయో, లేక అది ఉత్తి భ్రమేనని భావించి ధైర్యంగా ముందడుగు వేస్తాయో చూడాలి. మొత్తానికి లోక్‌సభకూ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరపాలన్న మోదీ ఆలోచన ఎన్నికల సంఘం సంసిద్ధత

ప్రకటించడంతో ఇప్పుడు దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి పార్లమెంట్‌ చట్ట సవరణ చేస్తే భవిష్యత్‌లో ఎలాంటి అవరోధాలు ఉండవు. ఏకకాలపు ఎన్నికలతో బోలెడంత సమయమూ, ఖర్చూ కలిసొస్తుందన్న దానిలో సందేహం లేదు. ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు వస్తూండటం, అక్కడక్కడా ఉప ఎన్నికలు రావడం వల్ల దేశ ఖజానానూ భారం పడుతోంది. పరిపాలనకు అంతరాయం ఏర్పడుతోంది. కేందప్రభుత్వం కూడా తదనుగుణంగా ఆచితూచి అడుగులు వేయవలసి వస్తున్నది. జమిలి ఎన్నికలతో ఈ బాధ తప్పుతుందని బీజేపీ వాదనగా ఉంది. మోడీ దీనిని తెరపైకి తెచ్చి చర్చకు పెట్టారు. దేశంలోని ప్రధాన రాష్టాల్లో ఎన్నికలు ప్రకటించిన తరువాత కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆయా రాష్టాల్ల్రో ఎన్నికల కారణంగా కొన్ని విధానపరమైన నిర్ణయాలు వాయిదా వేయవలసి వస్తోంది. దేశం మొత్తానికి అత్యంత ముఖ్యమైన కీలకమైన నిర్ణయాలకు ప్రభుత్వం దీర్ఘకాలం దూరంగా ఉండవలసి రావచ్చు. అసలు విషయం, జమిలి ఎన్నికలపై బీజేపీకి ఎన్నో ఆశలున్నాయి. నిజానికి ఎన్నికల సంస్కర ణలు జరగాల్సి ఉంది. బలవుంతుడు, ఆర్థికంగా బలం ఉన్నవారే ఎన్నికవుతున్నారు. ఒక్కరే పలుమార్లు ఎన్నికవుతున్నారు. ఏకంగా ఏడెనిమిది సార్లు చట్టసభలకు ఎన్నకవుతూ వస్తున్నారు. దీంతో ఇతరులకు అవకాశలు లేకుండాపోతున్నాయి. వారే అసలుసిసలు రాజకీయ నేతలుగా గుర్తింపు పొందుతున్నారు. జమిలి ఎన్నికలతో పాటు ఇలాంటి సమస్యలపైనా చర్చించాలి. రాజకీయకారణాలు, అధికారపు లెక్కలు లేనిదే పాలకపక్షాలు ఈ తరహా చర్యలకు సిద్ధపడవన్నది అందరికీ తెలుసు. ఎక్కడో ఓ చోట మొదలు పెడితే తప్ప సంస్కరణలు రావు. ఎన్నికల కాలంలో రాష్ట్రస్థాయి సమస్యలు, అవసరాల ప్రాధాన్యం తగ్గిపోయి, ఓటర్లు జాతీయ దృష్టితో ఓటుచేస్తారు కనుక ఇది తమకు లాభిస్తుందని దాని నమ్మకం. ఈ దేశంలో ఓటర్లకు ఒకే పార్టీకి ఓటుచేసే లక్షణం బాగా ఉన్నందున ఈ బలహీనత ఉపకరిస్తుందని విశ్వాసం. బలమైన ప్రాంతీయ పార్టీలున్న రాష్టాల్లోక్రి మోదీ హవాతో ఏకకాలపు ఎన్నికల ద్వారానే చొరబడగలనని బీజేపీ భావన. బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొట్టడం, బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడం ఈ దెబ్బతో సాధ్యపడవచ్చు. ప్రాంతీయపార్టీల ప్రాబల్యంతగ్గి, చీటికీ మాటికీ వాటిని బతిమాలుకొనే అవసరమూ పోతుందన్న భావనా ఉండివుంటుంది. అయితే ఏకకాలంలో ఎన్నికలతో పాటు, ఒక వ్యక్తికి రెండుసార్లు మాత్రమే పోటీ చేసే అవకాశం,మహిళా రిజర్వేషన్లు వంటి నిర్ణయాలు తీసుకుంటే సంస్కరణలకు అర్థం ఉంటుంది.