ఎయిర్‌పోర్టుల్లో భద్రత తీవ్రం

హైజాక్‌ బెదరింపులతో అప్రమత్తం
న్యూఢిల్లీ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులన్నింటిలో హై అలర్ట్‌ విధించారు. ఎయిరిండియా విమానం హైజాక్‌ చేయనున్నారనే బెదిరింపు వార్తలతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయాలన్నింటిలో భద్రతను కట్టుదిట్టం చేశాయి సీఐఎస్‌ఎఫ్‌ దళాలు. ప్రయాణికులను, లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు అధికారులు. ఎయిర్‌ పోర్ట్‌ పరిసరాల్లో వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత దేశంలోని ఎయిర్‌ పోర్టుల్లో భద్రతను టైట్‌ చేసిన అధికారులు.. తాజా బెదిరింపు కాల్‌ తో మరింత అలర్ట్‌ అయ్యారు. ఆ కాల్‌ ఎక్కడ నుంచి వచ్చింది? అందులో వాస్తవమెంత అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.