ఎస్పీఎం కార్మికులను పట్టించుకోని పాలకులు

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌1 : సిర్పూరు కాగితం మిల్లు(ఎస్పీఎం) కార్మికుల భవిష్యత్‌ ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. జీతాలు లేక గత ఆరు నెలలుగా వారు నానాయాతన పడుతున్నారు. యాజమాన్యం గత సెప్టెంబరు 27న షెట్‌డౌన్‌ పేరిట కాగితం ఉత్పత్తి నిలిపివేసి ఆరు నెలలు గడిచింది.  నాటినుంచి కార్మికులు దీక్షలకు దిగారు. ఆందోజలను చేపట్టారు. సిఎంను, మంత్రులను కలిసి విన్నవింంచారు. ఆనాటినుంచి  కనీసం కార్మికులకు వేతనాలను కూడా చెల్లించడం లేదు. ఎస్పీఎం గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడిగా ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యవహరిస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ఆయన సమక్షంలో పలుమార్లు సమావేవౄలు జరిపినా లాభం లేకుండా పోయింది. చివరగా జిల్లా బిజెపి  నాయకులు హైదరాబాద్‌లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిసి వివరించారు. యాజమాన్యం ఆధునీకరణ పేరిట కోట్లు రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని, పాత నాసిరకం యంత్రాలను ఏర్పాటు చేసి, నిధులన్నీ తమ సొంత ప్రయోజనాలకు యాజమాన్యం మళ్లించినట్టు చెప్పారు. ఎస్పీఎం విషయాన్ని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ దృష్టికి తీసుకుపోయి, పునరుద్ధరించేందుకు తమవంతు కృషి చేస్తామని కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చినట్టు తెలిపారు. కార్మిక సంఘాలు, కార్మికుల ఆధ్వర్యంలో చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టి, గవర్నర్‌ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించేందుకు కార్మికులు నిర్ణయించారు. ఇప్పటికే వామపక్ష కార్మిక సంఘాలు పలు మార్లు రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేసి పోరాటం చేసినా లాభం లేకుండా పోయింది. దీంతో కార్మికులు  ఇప్పుడు తమ భవిస్యత్‌పై ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.