ఎస్సారెస్పీ ఆందోళనతో కట్టుదిట్టమైన చర్యలు

నిజామాబాద్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): శ్రీరాంసాగర్‌ స్థిరీకరణతో రైతులకు మేలు జరుగనుందని అధికారులు అంటున్నారు. అయితే నీళ్ల విడుదల కోసం రైతులు ఆందోళనచేస్తున్నారు. వర్షాభావంతో ఇటీవల నీళ్లు రాక తగిన మోతాదులో ప్రాజెక్టులో నీరు చేరలేదు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా లీకేజీ నీటిని విడుదల చేయాలని రైతుల చేస్తున్న ఆందోళనల దృష్ట్యా ముందస్తుగా పలు జాగ్రత్తలు చేపట్టారు. ఈ మేరకు సవిూప గ్రామాల్లో పర్యటించి గ్రామస్థులకు నియమ నిబంధనలను వివరిస్తున్నారు. కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌, మండలాల రైతులు ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా ఎక్కడిక్కడే ఆపేందుకు రోడ్డు వెంబడి పహారాకాస్తున్నారు. అనుమతి లేకుండా ఎలాంటి వాహనాలను, పర్యాటకులను ప్రాజెక్టుకు అనుమతించడం లేదు.కాళేశ్వరం పూర్తయితే అసలు నీటికి కొదువ ఉండబోదన్నారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మించక పోవడంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ పాపం వారిదేనని స్థానిక టిఆర్‌ఎస్‌ నేతలు జీవన్‌ రెడ్డి తదితరులు అన్నారు. ఆనాడు అక్రమంగా పులిచింతల, పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులను కట్టి ఆంధ్రాకు అక్రమంగా నీళ్లు తరలిస్తుంటే విూ పౌరుషం ఏమైందని నిలదీశారు. తెలంగాణ ప్రాజెక్టులను పండబెట్టి ఆంధ్ర ప్రాజెక్టులను కడుతున్నప్పుడు ఎక్కడ పోయింది ఈ ఆవేశం అని ప్రశ్నించారు. తెలంగాణలో పెట్టాల్సిన విద్యుత్‌ ప్రాజెక్టులను విజయవాడ, కడపల్లో పెడుతున్నప్పుడు ఎందుకు మూగబోయింది నిలదీశారు. పాలకులను ఆనాడే నిలదీసి ఉంటే ఇప్పటికే మన ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు. టిఆర్‌ఎస్‌ కు తెలంగాణ, రాష్ట్ర అభివృద్ధే ఎజెండా అని మంత్రి స్పష్టం చేశారు. అరవై ఏండ్లలో సాధించని ఎన్నో విజయాలు కేవలం నాలుగేళ్లలో సిఎం కెసిఆర్‌ సాధించారన్నారు. చిల్లర రాజకీయ విమర్శలు ప్రజలు కోరుకోవడం లేదని, ప్రతిపక్షాలు హుందాగా వ్యవహరించాలన్నారు. నీటి రాజకీయాలను రెచ్చగొడుఉతన్నారని, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇకపోతే రాష్ట్రాన్ని విత్తన కేంద్రంగా మార్చుకోవడానికి సీఎం కేసీఆర్‌ పలు చర్యలు తీసుకొంటున్నారని అన్నారు.