ఎస్సీల అభివృద్దికి చర్యలు

నిర్మల్‌,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   దళితులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌ అన్నారు.  ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఏజెన్సీలో ఎస్సీలు ప్రభుత్వం అందించే ఎలాంటి పథకాలకూ నోచుకోవడం లేదని పలువురు దళిత నాయకులు  అన్నారు. గ్రామాల్లో విద్య, ఉద్యోగ, ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారన్నారు. ఎస్సీలకు ప్రభుత్వం ద్వారా రైతులకు భూమి కొనుగోలు పథకం, వ్యవసాయ పనిముట్లు, కూరగాయలు పందిరి, భూమి అభివృద్ధి వంటివి రాయితీపై అందిస్తుందని, 100 యూనిట్ల కరెంటు ఉచితంగా అందిస్తుందని, లైసెన్సు ఉన్నవారికి స్వయం ఉపాధి కోసం వాహనాలు అందిస్తుందని, యువతకు పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ అందిస్తుందని అన్నారు. అనంతరం ఎస్సీ వాడల్లో జీవన సిత్థిగతులపై వివరాలు సేకరించారు.