ఎస్సీ కార్పోరేషన్‌ రుణపరిమితి పెంపు

నల్గొండ,మే31: దళితులకు మూడు ఎరకాల భూ పంపిణీ కార్యక్రమం జూన్‌ 2 నుంచి జిల్లాలో వేగవంతం కానుందని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దళితుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని చెప్పారు.ఎస్సీలకు చెందిన నిరుద్యోగ యువతీయువకులకు కార్పొరేషన్‌ నుంచి అందే రుణాలు రూ.1లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచనున్నట్లు  వివరించారు. ప్రభుత్వం కళాకారులకు కల్పించిన ఉద్యోగ నియామకాలలో అవకాశం రాని దళిత కళాకారులు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.  ఇదిలావుంటే ప్రభుత్వం రాయితీపై అందించే వరికోత యంత్రాలు, ట్రాక్టర్లు తదితర యంత్ర పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ జేడీఏ నర్సింహారావు అన్నారు.  ఖరీఫ్‌లో ఎరువుల కొరత ఉండదని, సరిపడ విత్తనాలను అందుబాటులో ఉంచినట్టు  తెలిపారు. బిందు సేద్యం ద్వారా సాగుచేపట్టి మంచినీటిని ఆదా చేయాలన్నారు