ఎస్‌ఐ పోస్టులకు నేటి నుంచిరాత పరీక్షలు

అమరావతి,ఫిబ్రవరి22(ఆర్‌ఎన్‌ఎ): ఏపీ పోలీసుశాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీ పక్రియలో భాగగంఆ నేటి నుంచి రెండురోజులు రాత పరీక్షలు జరగుతాయి.  ప్రాథమిక ప్రవేశ, దేహదారుఢ్య పరీక్షల తర్వాత నిర్వహించే తుది రాతపరీక్ష శనివారం ప్రారంభమవుతోంది. రెండురోజులపాటు నిర్వహించే నాలుగు పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన వారిని పోలీసుశాఖ శిక్షణకు ఎంపిక చేస్తుంది. శిక్షణ విజయవంతంగా ముగించుకున్న అభ్యర్థులు ఎస్‌ఐగా ఉద్యోగాల్లోకి చేరతారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసుశాఖ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, పోస్టులతోపాటు అగ్నిమాపకశాఖలో స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌, జైళ్లశాఖలో డిప్యూటీ జైలర్‌ ఉద్యోగాల భర్తీకి గత నవంబరు 1న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం పోస్టులు 334. ప్రాథమిక ప్రవేశ పరీక్షలో అర్హత సాధించించిన వారికి జనవరి 21 నుంచి ఫిబ్రవరి 9వరకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. అర్హత సాధించిన 32,745మందికి 15నుంచి హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసిన బోర్డు.. 23, 24 తేదీల్లో తుది రాతపరీక్ష నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. విశాఖపట్నంలో 8,928, కాకినాడలో 4,654, గుంటూరులో 11,409, కర్నూలులో 7,754మంది పరీక్ష రాసేలా ఏర్పాట్లుచేసింది. శనివారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్‌-2, ఆదివారం ఇదే సమయాల్లో ఉదయం పేపర్‌-3 మధ్యాహ్నం పేపర్‌-4 పరీక్ష ఉంటుందని బోర్డు చైర్మన్‌ కుమార్‌ విశ్వజీత్‌ తెలిపారు.