ఏకపక్ష వాదనతో అరెస్టు తగదు

– ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు 
న్యూఢిల్లీ, మే16(జ‌నం సాక్షి) : ఏకపక్ష వాదనలతో ఎస్సీ, ఎస్టీ చట్టం కేసుల్లో అరెస్టులు తగవని, ఇరు పక్షాల వాదనలు విన్నతరువాత తప్పుంటే అరెస్టులకు పూనుకోవాలని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలపై దురాగతాల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు మార్చి 20న ఇచ్చిన తీర్పును పునఃసవిూక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ స్పష్టతనిచ్చింది. సమాజంలో ఉన్నవారందరికీ సమాన స్వేచ్ఛ, న్యాయమైన విధానాలు అమలయ్యేలా  జాగ్రత్తవహించవ
లసిన బాధ్యత తనకు ఉందని పేర్కొంది. భారతదేశ రాజ్యాంగంలోని అధికరణ 21ప్రకారం ప్రజలకు లభిస్తున్న ప్రాణ రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను నిరాకరించే చట్టాన్ని పార్లమెంటు చేయజాలదని వివరించింది. తదుపరి విచారణ జూలైలో జరుగుతుందని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం నమోదయ్యే కేసుల్లో నిందితులను తక్షణమే అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇది సరికాదని సుప్రీంకోర్టు మార్చి 20న ఇచ్చిన తీర్పులో పేర్కొంది. ఫిర్యాదులపై ప్రాథమిక దర్యాప్తు జరిగిన తర్వాత నిందితులను అరెస్టు చేయాలని తెలిపింది. ఈ తీర్పును పునః సవిూక్షించాలని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 2న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పస లేని, ప్రేరేపిత ఫిర్యాదు కాదని నిర్థారించుకున్న తర్వాత మాత్రమే నిందితులను అరెస్టు చేయాలని తెలిపింది.