ఏజెన్సీలో వ్యాధులపై అధికార యంత్రాంగం అప్రమత్తం

15నుంచి రాపిడ్‌ ఫీవర్‌ సర్వే

116 గ్రామాల్లో వైద్య బృందాలు సర్వే

ఆదిలాబాద్‌,జూన్‌13(జ‌నం సాక్షి): తొలకరి వ్యాధులపై జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది.ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ నెల 15 నుంచి రాపిడ్‌ ఫీవర్‌ సర్వే నిర్వహించనున్నారు. ఉట్నూర్‌, ఇంద్రవె ల్లి, నార్నూర్‌, గాదిగూడ, సిరికొండ మండల్లాలోని 116 గ్రామాల్లో వైద్య బృందాలు సర్వే నిర్వహిస్తాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, హెల్త్‌ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి స్థానికుల వివరాలు సేకరిస్తారు. ఎవరైనా అ నారోగ్యంతో బాధపడితుంటే వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్యసేవలు అందిస్తారు. గ్రామస్థాయిలో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు వైద్య సిబ్బందికి వెంటనే సమాచారం ఇస్తారు. గిరిజన గ్రామాల్లో పరిశుభ్రత లోపించకుండా చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగా 15 శానిటేషన్‌ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. గ్రామాల్లో నిలిచిన నీటి నిల్వల్లో దోమలు పెరుగకుండా లార్వాలను నివారించేందుకు ఈ బృందాలు చర్యలు తీసుకుంటా యి. గ్రామాల్లో ఐఆర్‌ స్పే చేస్తారు. నీటి నిల్వ ప్రాం తాలను తొలగించడంతో పాటు ఆయిల్‌బాల్స్‌ను వ దులుతారు. వీటితో పాటు గంబూషియా చేప పిల్లల ను సైతం వేస్తారు. వానాకాలంలో కలుషితమైన నీటి తో వ్యాధులు రాకుండా తాగునీటి విభాగం అధికారులు చర్యలు తీసుకుంటారు. తాగునీటి బావుల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ను వేయడంతో పాటు పంచాయతీ సి బ్బంది మురికికాలువలను శుభ్రపర్చడం, చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేస్తారు. వీటితో పాటు పరిశుభ్రత కోసం కళాబృందాలతో గిరిజన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లాలోని పేద ప్రజలకు అన్ని రకాల వైద్యసేవలు అందించడానికి చర్యలు తీసుకుంటోంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో 16 ప్రాథమికఆరోగ్య కేం ద్రాలు, 108 సబ్‌సెంటర్ల ద్వారా 115 రెవెన్యూ గ్రా మాల పరిధిలోని 370 ఆవాస గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులతో పాటు సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవసరమైన వైద్యం అందిస్తున్నారు. వర్షాకాలంలో వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మలేరియా, టైఫాయిడ్‌, డయేరియా, చికున్‌గున్యా లాంటి వ్యాధులు ఇక్కడి ప్రజలపై ప్రభావం చూపుతాయి. గిరిజన ప్రాంతాల్లో నాలుగేళ్లుగా ఈ వ్యాధులను నివారించడానికి అధికారులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. సీజనల్‌ వ్యాధులు రాకుండా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ముందుస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ ఏ డాది సైతం వర్షాకాలం వ్యాధులపై అధికారులు ముం దుగానే ప్రణాళికలు తయారు చేశారు. వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడానికి ఈ నెల 15 నుంచి రాపిడ్‌ ఫీవర్‌ సర్వే చేపడుతున్నారు. గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తక్షణ వైద్యసేవలు అందించడానికి బృందాలను నియమించారు. మలేరియా, టైఫాయిడ్‌ లాంటి వ్యాధులు రాకుండా నీటి నిల్వలను తొలగించడంతో పాటు ఆయిల్‌బాల్స్‌, గంబూషియా చేప పిల్లలను వేస్తున్నాం.