ఏపీని వివరణ కోరిన కృష్ణా బోర్డు

` పోతిరెడ్డిపాడుకు సంబంధించిన పూర్తిస్థాయి

నివేదిక, వివరాను అందించాని ఆదేశంహైదరాబాద్‌,మే 15(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాయసీమ ఎత్తిపోత పథకం చేపట్టేందుకు జారీ చేసిన జీవోకు సంబంధించిన వివరాను సమర్పించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కోరింది. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక, వివరాను అందించాని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై తెంగాణ చేసిన ఫిర్యాదుపై స్పందించిన బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ మేరకు బోర్డు సభ్యుడు హరికేష్‌ విూనా తెంగాణ ప్రభుత్వ లేఖను జతపరుస్తూ ఏపీ జవనరుశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.‘‘శ్రీశైం నుంచి అదనంగా మూడు టీఎంసీ నీటిని తరలించేందుకు ప్రతిపాదించిన కొత్త ఎత్తిపోతపై తెంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంపుపై తెంగాణ గతంలో బోర్డుకు ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగా ఫిబ్రవరి 5వ తేదీన ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరాం. ఈ నె 13వ తేదీన మరో లేఖ రాసినప్పటికీ ఏపీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదు’’ అని లేఖలో పేర్కొంటూ ఏపీ ప్రభుత్వ వివరణ కోరింది.