ఏసీడీ బిల్లు ఉపసంహారించుకోవాలి.

 

 

 

 

 

 

– ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఉమ్మడి జిల్లా కార్యదర్శి అంబాలా మహేందర్.
బెల్లంపల్లి, ఫిబ్రవరి 1, (జనంసాక్షి )తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ శాఖ వినియోగదారులపై అడ్వాన్స్ కంజక్షన్ డిపాజిట్ (ఏసీడీ )డ్యూ పేరుతో అక్రమంగా చేస్తున్న అదనపు వసూలు ఉపసంహారించుకోవాలని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి అంబాలా మహేందర్ డిమాండ్ చేశారు. ఏసీడి పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలపై వేలకోట్ల రూపాయల భారం వేసి దండుకోవడం దుర్మార్గమని అన్నారు. రైతాంగానికి 24 గంటలు ఉచితంగా కరెంటు ఇస్తామని ప్రభాగాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేద రైతుకు 24 గంటల ఉచిత ఎక్కడ విద్యుత్ సరఫరా చేశాడో చెప్పాలన్నారు. కేవలం భూస్వాములకు వందల వేల ఎకరాలు ఉన్నటువంటి వారికి ఉచిత కరెంటు, దళిత బంధు లాంటివి ఇచ్చి అదే పేదలకు ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడన్నారు. గత సంవత్సరంలో విద్యుత్ శాఖ వారు డెవలప్మెంట్ చార్జీలు అనే పేరుతో 3300 రూపాయలు ముక్కు పిండి పేద ప్రజల నుండి దండుకున్నారన్నారు. అప్పుడు కొన్ని వంతపలికే పార్టీలు ఆందోళన చేసిన కానీ ఫలితం పొందలేదన్నారు. వ్యవసాయా రంగానికి రైతాంగానికి ఉచితంగా 24 గంటలు కరెంటు ఇవ్వాలని, అప్రకటిత కరెంటు కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాలని, ఏసిడి బిల్లులు ఉపసంహరించుకోకుంటే ప్రజలు, కార్మికులు, కర్షకులు ఎటువంటి పోరాటానికైనా సిద్ధం ఉండాలని పిలుపునిచ్చారు. ఏసీడీ బిల్లు ఉపసంహారించుకోనిపక్షంలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(ఒపీడీఆర్ ) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.