*ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ*

మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్)

ఎంతోమంది అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుపడుతున్నా మిగతా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. మంగళవారం కోదాడలో మరో అవినీతి చేప లంచం తీసుకుంటూ
ఏసీబీ వలలో చిక్కింది.
మేళ్లచెర్వు మండలంలో ఎస్వీ ఎంటర్ప్రైజెస్ కు చెందిన విద్యుత్ కాంట్రాక్టర్ తమ పెండింగ్ కాంట్రాక్ట్ బిల్లుల కోసం ఏఈ గోవింద రాజుని సంప్రదించగా
రూ.54,000 డిమాండ్ చేశారు. మొదటి విడతగా రూ.25,000 చెల్లించిన సదరు కాంట్రాక్టర్,రెండవ విడత రూ.29000 కోదాడలో ఇస్తుండగా ఏసీబీ అధికారులు
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పీ మాట్లాడుతూ
విద్యుత్ కాంట్రాక్ట్ బిల్లుల విషయంలో ఎస్వీ ఎంటర్ప్రైజెస్ నుండి రూ.54,000  లంచం డిమాండ్ చేసి,ముందే రూ. 25,000 తీసుకొని, మంగళవారం రూ.29,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు తెలిపారు.ఏసీబీకి పట్టుబడిన మేళ్లచెరువు మండల  విద్యుత్ ఏఈ గోవింద రాజు ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టినట్లు చెప్పారు.
విద్యుత్ ఏఈ గోవింద రాజును తదుపరి విచారణ నిమిత్తం హుజూర్ నగర్ విద్యుత్ డీఈ కార్యాలయానికి తరలించామన్నారు.
ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ హెడ్ ఆఫీస్ 1064 నెంబర్ కి తెలియజేయాలని,
అలాంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.