ఐటి విస్తరణతో యువతకు చేయూత : ఎంపి

కరీంనగర్‌,జనవరి9(జ‌నంసాక్షి ):  ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్టాల్రకు ఆదర్శంగా నిలుస్తుందని ఎంపీ వినోద్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రాలకు ఐటిని విస్తరించడం గొప్ప కార్యక్రమమని అన్నారు. దీంతో జిల్లాల్లో యువతకు ఉపాధి అవకాశాలు దక్కడమే గాకుండా, యువ ఆలోచనలకు ప్రాధనా/-యం పెరగగలదని అన్నారు. బహుశా ఇలాంటి పథకం దేశంలోనే ప్రథమం కావచ్చాన్నారు. ఓ రకంగా ఇతర రాష్టాల్రకు ఇది ఆదర్శం కానుందన్నారు. మూడున్నర సంవత్సరాల కాలంలోనే రాష్టాన్న్రి ప్రగతి మార్గంలో నిలిపిన ఘనత సిఎం కెసిఆర్‌దన్నారు. మహిళలకు, యువతులకు భద్రతగా షీటీమ్‌లను ప్రారంభించిన ఘనత ప్రభుత్వానిదేనని అన్నారు.ఉద్యమ స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధనలో మమేకం కావాలని  అన్నారు. మాది చేతల ప్రభుత్వమని, ఆంధ్రా పాలకుల ఆరోపణలు పటాపంచలు చేస్తూ కరెంటు కోతలను అధిగమించామన్నారు. సంక్షేమ పథకాల అమలుతో ప్రభుత్వం కన్నతల్లి పాత్రను పోషిస్తుందని, దళితుల సంక్షేమమే ఎజెండాగా పని చేస్తానన్నారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రతీఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు.