ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోంది

హైదరాబాద్: ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం ప్రారంభమైన హెచ్‌ఐసీసీలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 9వ వార్షికోత్సవ సదస్సులో మంత్రి పాల‍్గొని మాట్లాడారు. ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతుందని, ఫైబర్ గ్రిడ్ ద్వారా పల్లెలకు ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ఈ గవర్నెన్స్‌లో తెలంగాణ రాష్ట్రం ముందుందని, రాష్ట్రంలో తొలిసారిగా ఈ పంచాయతీ ప్రవేశపెట్టామని, నగదు రహిత లావాదేవీల్లో దేశంలోనే తెలంగాణ నెం.1 గా ఉందని వివరించారు. డిజిటల్ లిటరసీ పెంచేందుకు సమగ్ర విధానం తీసుకొస్తున్నామని, దేశంలోనే టెక్నాలజీ పరంగా అతిపెద్దది హైదరాబాద్ టీహబ్. టీహబ్ ద్వారా ఎంట్రపెన్యూర్స్‌ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
సీఎం కేసీఆర్ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. స్టార్టప్‌లకు తెలంగాణ చేయూతనిస్తుంది. టీ హబ్‌లో 200 లకు పైగా స్టార్టప్స్ పనిచేస్తున్నాయి. రాబోయే రోజుల్లో యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఒపెన్ డేటా పాలసీలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. 4 వేల కస్టమర్ కేంద్రాల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.