ఐమాన్ బనానా ఫ్రీజర్ యంత్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

గద్వాల ఆర్ సి ,జనవరి 10 (జనం సాక్షి). ఈరోజు గద్వాల్ జిల్లా కేంద్రంలోని భీమ్ నగర్ లో  బనానా ఫ్రూట్ ఎసి గోదాం షాప్ ను ప్రారంభం చేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి .అనంతరం ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగినది. షాప్ యజమాని ఎమ్మెల్యే చైర్మన్లను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్య క్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్ మురళి, గద్వాల టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి సాయి శ్యామ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ధర్మ నాయుడు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు నాగులు యాదవ్, సీతారాములు, వెంకటేష్, చిన్న తదితరులు పాల్గొన్నారు.