*ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం

 భారతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పి కళావతమ్మ
వనపర్తి సెప్టెంబర్ 26 (జనం సాక్షి)తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజా కంఠకులైన దొరలకు నిజాం రజాకర్ల పాలనకు వ్యతిరేకంగా ఐలమ్మ సాగించిన సమరశీల పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పి.కళావతమ్మ పిలుపునిచ్చారు. సోమవారం వనపర్తి సిపిఐ జిల్లా కార్యాలయంలో చాకలి ఐలమ్మ 127 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కళావతమ్మ వనపర్తి సిపిఐ మండల కార్యదర్శి రమేష్ మాట్లాడారు దొర రామచంద్రారెడ్డి నీ ఎదిరించి పోరాడి జైలుకెళ్ళిందన్నారు తమ కుటుంబం జైలు పాలైన ధైర్యం కోల్పోక కొనసాగించిన మడమతిప్పని ఆమె పోరాటం మహిళా లోకానికే గాక అందరికీ అనుసరణీయం అన్నారు నిజాం రజాకార్లు దొరల పాలనను అంతమొందించిన ప్రజాస్వామ్యంలో కేంద్ర రాష్ట్ర పాలకులు అదే నియంత్రత్వ ప్రజావ్యతిరేక పోకడలను కొనసాగిస్తున్నారని విమర్శించారు ధనవంతులు పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ పేద ప్రజలపై అనేక భారాలను మోపి నడ్డి విరుస్తున్నారని విమర్శించారు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడిన ప్రశ్నించిన వారిని లాటి చార్జీలు అరెస్టులు చేసి జైళ్లకు పంపుతున్నారని విమర్శించారు. పోడుభూమి ఉపాధి ,ఉద్యోగం గిట్టుబాటు ధరలు మానవ హక్కుల కోసం ప్రజలు రోడ్డు ఎక్కుతున్నారని గుర్తు చేశారు ప్రజల కోసం ఆ పోరాట యోధులు కన్న కలలను సాకారం చేసేందుకు వారి పోరు బాటలో నడవడమే నిజమైన నివాళి కాగలదన్నారు. కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎర్రకురుమన్న బాలరాజు మహిళా సమాఖ్య నాయకులు జయ ,జయమ్మ ,వెంకటమ్మ, ఏఐఎస్ఎఫ్ నాయకులు మనుసాగర్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area