ఒడిషాలో నేటి నీట్‌ పరీక్ష రద్దు

భువనేశ్వర్‌,మే4 (జ‌నంసాక్షి):  ఫొని తుఫానుతో ఒడిశా ప్రాంతం అతలాకుతలమైన కారణంగా ఆదివారం 5వ తేదీన జరగాల్సిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌)ను ఒడిశా రాష్ట్రంలో వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకే నీట్‌ను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం మే 5న నిర్వహించే నీట్‌కు దేశ వ్యాప్తంగా 15.19 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇతర వివరాలకు నీట్‌ వైబ్‌సైట్‌ను లాగిన్‌ అవొచ్చు.