ఓకే ఇంట్లో అక్క చెల్లెళ్లకి “ఎంబీబీఎస్” సీట్లు

ఓకే ఇంట్లో అక్క చెల్లెళ్లకి “ఎంబీబీఎస్” సీట్లు..!
ఆనందంలో కుటుంబ సభ్యులు..!!
అభినందించిన బంజారా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దశరథ నాయక్
మిర్యాలగూడ, జనం సాక్షి.
జాతీయ స్థాయిలో నీట్ పరీక్షలో వారు ప్రతిభ కనబరిచారు. ఏకంగా ఎంబిబిఎస్ సీట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకే కుటుంబంలో ఒకేసారి ఇద్దరికీ ఎంబీబీఎస్ సీట్లు రావడం పట్ల తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోతున్నారు. వారే మిర్యాలగూడ పట్టణంలోని రాజా రైస్ మిల్లు అపార్ట్మెంట్లో నివసించే నగారా అంజలి,రిషిక. 2022 లో జరిగిన నీటి పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధించి అంజలి సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఎం ఎన్ ఆర్ కళాశాలలో ఎంబిబిఎస్ సీట్ సాధించగా, రిషిక హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో ఉన్న కామినేని మెడికల్ కళాశాలలో సీటు సాధించారు. ఇరువురు సొంత అక్క చెల్లెలు కాగా వీరి తండ్రి నగర జామ్లా నాయక్ ప్రభుత్వ ఉపాధ్యాయులు గా దామరచర్ల మండలంలోని కొండ్రపోలు ఉన్నత పాఠశాలలో పనిచేస్తుండగా కాగా తల్లి మంగమ్మ గృహిణి. వీరికి ఇద్దరు సంతానం అమ్మాయిలు కాగా ఇద్దరు డాక్టర్లు రావడం హర్షించదగ్గ విషయం. ఇరువురిని బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోతు దశరథ నాయక్- రజిని దంపతులు స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో భాస్కర్, సింధు తదితరులు పాల్గొన్నారు.