ఓటర్‌ డే సందర్భంగా పోటీలు నిర్వహించాలి

ప్రజల్లో ఓటు చైతన్యం కలిగించాలి: కలెక్టర్‌
కామారెడ్డి,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కుకు నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ సత్యనారాయణ ఒక ప్రకటనలో సూచించారు. జనవరి 25న జాతీయ పౌరుల దినోత్సవం సందర్భంగా నేషనల్‌ ఓటరు డే నిర్వహించాలన్నారు. నేషనల్‌ ఓటరు డే సందర్భంగా నియోజకవర్గాల వారీగా జిల్లా స్థాయిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయాలని సూచించారు.జనవరి 25న ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌లో కొత్తగా రిజిష్ట్రర్‌ అయిన ఓటర్లకు ఎపిక్‌ కార్డులు, బ్యాడ్జీల ద్వారా సన్మానించేందుకు పోలింగ్‌ లెవల్‌ అధికారులు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఎలక్టోరల్‌ రిటర్నింగ్‌ అధికారి, సహాయ ఎలక్టోరల్‌ రిటర్నింగ్‌ అధికారులు నియోజకవర్గాలకు రెండు కిలోవిూటర్ల పరిధిలోని పోలింగ్‌ స్టేషన్‌లో కొత్త ఓటర్లను ఎన్‌రోల్‌ చేసేందుకు, సన్మానించేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఎక్కువ ఓటర్లను నమోదు చేయించిన చునావ్‌ పాఠశాల, ఈఎస్పీ స్కూల్స్‌, కళాశాలలను సన్మానించాలని సూచించారు. కార్యక్రమాలకు రాజకీయ పార్టీల ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని, మహిళా ఓటర్లను ప్రత్యేకంగా ఎన్‌రోల్‌ చేసేందుకు బీఎల్‌వోలకు శిక్షణ అందించాలని పేర్కొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి డీఈవో ద్వారా ఫోన్‌ఇన్‌ కార్యక్రమాలు, రెడియో, టీవీల ద్వారా కార్యక్రమాలు చేపట్టి ఓటర్ల సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. ప్రింట్‌ విూడియా ద్వారా ప్రకటనను జనవరి 25న ప్రచురించేందుకు చర్యలు తీసుకోవాలని, ఎలక్టోరల్‌, లిటరసీ క్లబ్‌ ద్వారా యూత్‌ ఓటరు ఫెస్టివల్‌ రిసోర్సు బుక్‌ చేపట్టాలని పేర్కొన్నారు. జనవరి 15న ఆర్మీడే సందర్భంగా నేషనల్‌ ఓటరు డే పైన సర్వీస్‌ పర్సనల్‌ను భాగస్వామ్యం చేసి అవగాహన చేపట్టాలని ఆదేశించారు.