ఓడిన మూడు రాష్ట్రాల్లో సీట్లు సాధించడమెలా? 

వ్యూహాలు పన్నుతున్న బిజెపి..విపక్షాలు
న్యూఢిల్లీ,మార్చి12(జ‌నంసాక్షి): సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో మళ్లీ గెలుపు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,అమిత్‌షాలు  ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు.  మూడు బిజెపి పాలిత రాస్ట్రాలు గత ఎన్నికల్లో  కాంగ్రెస్‌ దక్కించుకోవడంతో అక్కడ గెలుపు కోసం  వ్యూహాలు పన్నుతోంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. ఆ మూడు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నందున అక్కడ పాగా వేయడం అంత సులవు కాదు. ఇక్కడ మెజార్టీ ఎంపి స్థానాలు గతంలో కైవసం చేసుకున్న బిజెపికి అంత సులవు కాకపోవచ్చు. ఈ మూడు రాష్ట్రాల్లో ఎంపి సీట్లు తగ్గితే మొత్తంఆ మెజార్టీ కడా తగ్గగలదు. దీంతో ఇక్కడ మెజార్టీ కోసం వ్యూహాలు పన్నుతున్నారు. ఈ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో మోడీని అడ్డుకోవాలని విపక్షాలు కూడా వ్యూహాలు పన్నుతున్నాయి. శాసనసభ ఎన్నికలలో ఓడిపోవడంతో  లోక్‌సభ ఎన్నికల్లో మోడీని ఢీకొనడం ఈజీ అన్న అభిప్రాయంతో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ప్రజలలో వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్‌
ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. లోక్‌సభ ఎన్నికలలో అదే వ్యతిరేక ప్రభావం ఉంటుందన్న విషయం గ్రహించి ఆ మేరకు బిజెపి ద్వయం వ్యూహం పన్నుతోంది.  ఇకపోతే ఇటీవలి ఎన్నికలలో దెబ్బతిన్న భారతీయ జనతాపార్టీ నాయకులు జరిగిన పొరపాట్లకు పాశ్చాత్తాపం చెంది దూరమవుతున్న మిత్రపక్షాలను మళ్లీ అక్కున చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో పొత్తులకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మొత్తం విూద అటు జాతీయ స్థాయిలోనూ, ఇటు రాష్ట్రాలలోనూ  ఎన్నికల వేడి అందుకుంటోంది.  గతంలో లాగా మోడీ దూకుడు పనిచేయకపోవచ్చు. ఆయా రాష్ట్రాల్లో కూడా బిజెపిపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. మొత్తానికి బిజెపికి ఎన్నికలు నల్లేరువిూద నడక కాకపోవచ్చు.