ఓర్వలేకనే శ్రీధర్‌బాబుపై కుట్ర: శశిధర్‌ రెడ్డి

మెదక్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత,మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక తెరాస నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పిసిసి అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎ.శశిధర్‌ రెడ్డి అన్నారు. శ్రీధర్‌బాబు ప్రతిష్టను దిగజార్చే విధంగా తెరాస నాయకులు అనుసరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని మంగళవారం నాడిక్కడ అన్నారు. ఆదర్శవంతమైన రాజకీయాలకు మారుపేరుగా జీవిస్తున్న మాజీ మంత్రి శ్రీధర్‌బాబుపైన ప్రభుత్వం కుట్రలు పన్నడం దురదృష్టకరమని టీపీసీసీ అధికార ప్రతినిధి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మూడున్నరేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమి లేదని తెలిపారు. ప్రజలను ఎప్పటికప్పుడు ప్రలోభాలకు గురి చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్న ప్రభుత్వాన్ని కాదనుకొంటున్న ప్రజలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌ పార్టీని, నాయకులను ఇబ్బందులకు గురిచేసి, బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు నడపడం కోసం ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు ఆడుతున్న డ్రామాలో భాగమే

శ్రీధర్‌బాబు ఎపిసోడ్‌ అని విమర్శించారు.ఉద్యోగాల విషయంలో యువతకు అన్యాయం జరిగిందని, రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 12వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా, గడిచిన మూడేళ్లలో సంవత్సరానికి 6వేల చొప్పున 18 వేల ఉపాధ్యాయుల పదవీ విరమణ పొందారని, దీంతో 30వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, సుప్రీం కోర్టు మొట్టికాయలు వేయడంతో కేవలం ఎనిమిది వేల పోస్టులకు ఉత్తర్వులు ఇచ్చి నిరుద్యోగులకు అన్యాయం చేశారన్నారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే… రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో మిగులు బ్జడెట్‌ ఉండేదని 40 మాసాల్లో అప్పుల రాష్ట్రంగా మార్చారని జీవన్‌రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం జగిత్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 57ఏళ్లలో రూ.60వేల కోట్ల అప్పు చేస్తే ఈ మూడున్నరేళ్లలో రూ.1.40 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. ఇంత మొత్తంలో అప్పు చేసి ధనిక రాష్ట్రంగా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి 12 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోయారని ఆరోపించారు.