ఔనన్నా కాదన్నా… కెసిఆర్‌ది ఎన్నికల నినాదమే

భారీగా జనసవిూకరణ ద్వారా ప్రగతి నివేదన సభతో తెలంగాణలో తనకు తిరుగులేదని చెప్పదల్చుకున్న సిఎం కెసిఆర్‌ అనున్నకుది సాధించారు. జనం వచ్చారా..తెచ్చారా అన్నది పక్కన పెడితే జనప్రభంజనం కనిపించింది. ముందస్తు ఎన్నికలకు వెళితే తనకు తిరుగులేదని చెప్పదల్చుకున్న కార్యం దిగ్విజయం చేశారు. ఎలాంటి గందరగోళానికి తావివ్వకుండా ముక్కుసూటిగా తాను చెప్పదల్చుకున్నది ప్రజలకు చెప్పారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం…. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో టిర్‌ఎస్‌ ప్రభుత్వ ఏర్పాటు.. నాలుగేళ్లలో తీసుకున్న నిర్ణయాలు…చేసిన పనులు..మళ్లీ ఆశీర్వదిస్తే చేయబోయే పనులు సూటిగా చెప్పడం ద్వారా సిఎం కెసిఆర్‌ తన లక్ష్యాన్ని వివరించారు. అది ఎలా చెప్పారన్నది ఇక్కడ ముఖ్యం కాదు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆశీర్వదించండని కోరారు. ప్రధానంగా ఆత్మగౌరవ నినాదాన్ని పట్టాలకెక్కించారు. కాంగ్రెస్‌ ఢి/-లలీ గులాంగిరిని పరోక్షంగా తూర్పారా పట్టారు. 2014 ఎన్నికల్లో ప్రజలలోకి దూసుకుపోయిన కేసీఆర్‌, ఇప్పుడు కూడా తన ప్రణాళికలను అమలు చేయించగల ఉద్ధండుడిగా మరోమారు కేసీఆర్‌ నిరూపించారు. ఈ సభ తర్వాత ఊరూవాడా తెలంగాణ రాష్ట్ర సమితి గురించి మాత్రమే మాట్లాడు కోవాలన్న కేసీఆర్‌ ప్లాన్‌ సక్సెస్‌ అయ్యింది. నిరంతర కరెంట్‌ కెసిఆర్‌ సాధించిన అతిపెద్ద విజయంగా చెప్పుకోవాలి. చెరువుల పునరుద్దరణ, మిషన్‌ భగీరథ, ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ప్రజల ముందు ఏకరువు పెట్టారు. నాకన్నా విూకే అనుభవంలోకి వచ్చాయని గుర్తు చేశారు. అన్నింటికి మించి తాను ఎన్నికలకు వెళితే మళ్లీ గెలిపించండన్న వినతి చేశారు. ఆశీర్వదిస్తే మరింత ద్విగుణీకృతంగా పనిచేస్తానని చెప్పరు. ఓ రకంగా చెప్పాలంటే ఈ సభ ద్వారా విపక్షాలు పెదవి విరిచినా..కెసిఆర్‌ మాత్రం చెప్పదల్చుకున్న రీతిలో తన భవాలను, లక్ష్యాలను ప్రజల ముందుంచారు.

ఎన్నికల మాటెత్తకుండానే కేసీఆర్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరింరనే చెప్పాలి. . తెలంగాణ పురోభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న తెరాస ప్రభుత్వాన్ని మరోసారి దీవించాలని ప్రజలకు విజ్ఞప్తిచేయడం ద్వారా ఎన్నికలకు వెళదామన్న సంకేతాలు ఇచ్చేశారు. రాజకీయపరమైన నిర్ణయాలతో త్వరలోనే విూ ముందుకు వస్తామని లక్షలమంది హాజరైన సభాముఖంగా ప్రకటించడం ద్వారా వారిలో ఆశలు నింపారు. తెలంగాణకు, తెరాసకు ఏది మంచిదైతే ఆ నిర్ణయం తీసుకోవాలంటూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తనపై రాజకీయ బాధ్యత పెట్టారని వెల్లడించడం ద్వారా పరోక్షంగా ఇక సమరనినాదం చేశారు. తెలంగాణ అధికారం మన దగ్గరే ఉంటే ఆత్మగౌరవంతో ఉంటాం.. నిర్ణయాలు తీసుకుంటాం అని ఉద్ఘాటించడం ద్వారా కాంగ్రెస్‌, బిజెపిల ఢిల్లీ పెత్తనంపై పరోక్ష ఎత్తిపొడుపులు చేశారు. తమిళ సోదరుల మాదిరిగా ఆత్మగౌరవంతో తెలంగాణ అభివృద్ధి సాధిద్దామన్నారు. తెలంగాణ అభివృద్ధి, ఆదాయ ప్రగతి ఎట్టిపరిస్థితులో ఆగిపోకూడ దని, ప్రజల సహకారంతో అంకితభావంతో పని చేద్దామని కోరారు. తెరాస ప్రభుత్వం ఉన్నంతకాలం రైతుబంధు అమలవుతుందని స్పష్టం చేయడంతో భూమి ఉన్న వారికి మళ్లీ భరోసా నింపారు. మొత్తంగా కెసిఆర్‌ తను అనుకున్నరీతిలోనే సభను నడిపించారు. వచ్చే ఎన్నికల్లోగా మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లానీరు ఇవ్వకపోతే ఓట్లు అడగనని,ఎన్నికల్లోకి రాను అని చెప్పానన్న మాటలు గుర్తు చేస్తూ ఇప్పుడు ఇంటింటికి నీరు అందుతోందని..చెప్పడం ద్వారా తన వాగ్దాననా/-ని నెరవేర్చానని చెప్పారు. అంటే ఖలేజా ఉందని నిరూపించుకున్నట్లు ప్రకటించారు. ఓట్లు అడిగేందుకు ముందే దీపావళి నాటికి ఇంటింటికీ కృష్ణా, గోదావరి నీళ్లు వస్తాయి. ఆ నీళ్లతో ఇంటి ఆడపడుచుల కాళ్లు కడుగుతాం అని ప్రకటించారు. నిజానికి ఇప్పటికే అనేక గ్రామల్లో నిరంతర నీటి సరఫరా జరుగుతోంది. అన్ని పార్టీలు చివరి సంవత్సరంలో

కార్యక్రమాలు చేపడితే.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొలి క్యాబినెట్‌ సమావేశంలోనే 42 నిర్ణయాలు తీసుకున్నదని గుర్తుచేశారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హావిూలనే కాకుండా.. ఇవ్వని హావిూలనూ అమలు చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. రాష్ట్రం సాధించిన ప్రగతి మొత్తం విూ కళ్ల ముందే ఉన్నదని అన్నారు. తక్షణ ఉపశమన చర్యలు, సంక్షేమ కార్యక్రమాలు సరిపోవని, శాశ్వతంగా, బ్రహ్మాండంగా తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉండాలంటే.. ప్రజలకు శాశ్వత ప్రయోజనం కల్పించే పథకాలను అమలుచేయాల్సి ఉందన్నారు. ఆత్మగౌరవంతోనే తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినిధిగా టీఆర్‌ఎస్‌ పిన చేస్తున్నాయన్ని సంకేతం ఇచ్చారు. మనకు ఏం కావాలో.. ఏది మంచి నిర్ణయమో తీసుకునే అధికరాం మనకే ఉండాలన్న భావన తెలియ చేశారు. కొన్ని పార్టీలు ఢిల్లీకి గులాంలుగా ఉందాం.. ఢిల్లీ చక్రవర్తులకు సామంతులుగా ఉందామని చెప్తున్నయి. తెలంగాణ ప్రజలు, మేధావులు, రచయితలు, కళాకారులు, కవులు ఆలోచన చేయాలని పిలుపునిచ్చాయి. తెలంగాణకు సంబంధించిన నిర్ణయాధికారం తెలంగాణలో ఉండాల్నా.. ఢిల్లీ దొరల కింద ఉండాలా అన్న విూమాంసను ప్రజలకే వదిలేయడం ద్వారా కాంగ్రెస్‌,బిజెపిలను ఢిల్లీ పార్టీలుగా నిందవేశారు. ఢిల్లీకి మనం బానిసలం, గులాంలం కావద్దు. అది మన భవిష్యత్‌తరాలకు మంచిది కాదన్న భావన కల్పించారు. మాట తప్పితే, మడమ తిప్పితే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన ఆనాటి మాటలను మరోమారు చెప్పడం ద్వారా కెసిఆర్‌ తను ప్రజల మాటకు కట్టుబడి పాలిస్తున్నానని చెప్పకనే చెప్పారు. అంతిమంగా విూ ఆశీర్వచనం ఉండాలని చెప్పడం ద్వారా ఎన్నికల సమరనాదం వినిపించారు.